Skip to main content

Daily Current Affairs in Telugu: 2022, డిసెంబ‌ర్ 27th కరెంట్‌ అఫైర్స్‌

Current Affairs in Telugu December 27th 2022 (డైలీ కరెంట్‌ అఫైర్స్‌ తెలుగులో): Current Affairs for All Competitive Exams In Telugu. Latest Articles useful for TSPSC &APPSC Group-1,2,3, 4, SSC, Bank, SI, Constable and all other competitive examinations

Women's National Boxing Championships: నిఖత్‌ జరీన్‌ పసిడి పంచ్‌
తెలంగాణ స్టార్‌ బాక్సర్, ప్రపంచ చాంపియన్‌ నిఖత్‌ జరీన్‌ జాతీయ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో టైటిల్‌ నిలబెట్టుకుంది. ఈ పోటీల్లో పాల్గొన్న టోక్యో ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత లవ్లీనా బొర్గొహైన్‌ కూడా బంగారు పతకం సాధించింది. డిసెంబ‌ర్ 26న‌ ముగిసిన ఈ సీనియర్‌ మహిళల (ఎలైట్‌) జాతీయ బాక్సింగ్‌ పోటీల్లో పది పతకాలతో రైల్వే జట్టు (ఆర్‌ఎస్‌పీబీ) ఓవరాల్‌ చాంపియన్‌గా నిలిచింది. 50 కేజీల ఫైనల్లో నిఖత్‌కు అనామిక (ఆర్‌ఎస్‌పీబీ) నుంచి గట్టీపోటీ ఎదురైంది. కానీ 26 ఏళ్ల నిజామాబాద్‌ బాక్సర్‌ మాత్రం తన పంచ్‌ పవర్‌తో ప్రత్యర్థిని ఓడించింది. నిఖత్‌ 4–1తో గెలిచి టైటిల్‌ను నిలబెట్టుకుంది. 75 కేజీల తుది పోరులో అస్సామ్‌ మేటి బాక్సర్‌ లవ్లీనా 5–0తో సర్వీసెస్‌ స్పోర్ట్స్‌ కంట్రోల్‌ బోర్డు (ఎస్‌ఎస్‌సీబీ)కు చెందిన అరుంధతీ చౌదరిపై అలవోక విజయం సాధించింది.  

T20I: టీ20 క్రికెట్ చరిత్రలో మొదటిసారి.. 6 బంతుల్లో 5 వికెట్లు
2019 ప్రపంచ చాంపియన్‌షిప్‌ రజతం పతక విజేత మంజు రాణి 48 కేజీల ఫైనల్లో 5–0తో కళైవాణి (తమిళనాడు)పై ఏకపక్ష విజయం సాధించింది. శిక్ష (54 కేజీలు), పూనమ్‌ (60 కేజీలు), శశి చోప్రా (63 కేజీలు), నుపుర్‌ (ప్లస్‌ 81 కేజీలు) కూడా బంగారు పతకాలు సాధించారు. ఆర్‌ఎస్‌పీబీ జట్టు బాక్సర్లలో మరో ముగ్గురు రజతాలు పొందగా, ఇద్దరికి కాంస్య పతకాలు లభించాయి. 2021 యూత్‌ ప్రపంచ చాంపియన్‌ సనమచ తొక్‌చొమ్‌ (మణిపూర్‌) 70 కేజీల తుదిపోరులో 3–2తో శ్రుతి యాదవ్‌ (మధ్యప్రదేశ్‌)పై గెలిచింది. 12 కేటగిరీల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన 302 మంది మహిళా బాక్సర్లు ఈ చాంపియన్‌షిప్‌లో తలపడ్డారు. 

వీక్లీ కరెంట్ అఫైర్స్ (క్రీడలు) క్విజ్ (25 నవంబర్ - 02 డిసెంబర్ 2022)
Shane Warne: షేన్‌వార్న్‌కు ఆసీస్‌ బోర్డు సముచిత గౌరవం 
దివంగత క్రికెటర్‌ షేన్‌వార్న్‌ను ఆ్రస్టేలియా క్రికెట్‌ బోర్డు (సీఏ) సముచిత రీతిలో గౌరవించనుంది. ఇకపై ఆ్రస్టేలియా అత్యుత్తమ టెస్టు క్రికెటర్‌ అవార్డును షేన్‌వార్న్‌ పేరిట ఇవ్వనుంది. ఇకపై ఈ అవార్డు ‘షేన్‌ వార్న్‌ బెస్ట్‌ టెస్ట్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ఆ్రస్టేలియా’గా వ్యవహరిస్తారు. గత మార్చిలో షేన్‌ వార్న్‌ మృతి చెందిన తర్వాత అతని సొంత మైదానం మెల్‌బోర్న్‌ గ్రౌండ్‌లో మొదటి టెస్టు జరుగుతున్న సందర్భంగా డిసెంబ‌ర్ 26న‌ ఈ విషయాన్ని ఆసీస్‌ బోర్డు ప్రకటించింది. లెగ్‌స్పిన్‌ దిగ్గజం వార్న్‌ 145 టెస్టుల్లో ఆసీస్‌కు ప్రాతినిధ్యం వహించి 708 వికెట్లు పడగొట్టాడు.   

Covid Deaths: కరోనా కరాళనృత్యం.. మృతదేహాలతో బారులుతీరిన బంధువులు
కోవిడ్‌ దెబ్బకు డ్రాగన్‌ దేశం బిక్కుబిక్కుమంటోంది. ఆస్పత్రులకు పోటెత్తుతున్న జనంతో, మృతదేహాలను వెంటేసుకొస్తున్న బంధువులతో శ్మశానాలు దాదాపు నిండిపోయాయి. కోట్ల మంది పౌరులు కోవిడ్‌ బారినపడి సరైన వైద్యం కోసం కిక్కిరిసిన ఆస్పత్రుల బయట వేచిచూస్తున్నారు. అంతులేని మరణాలకు చైనా ఆలవాలంగా నిలిచిందనే తెలిపే తాజా వీడియో ఒకటి మీడియాలో ప్రత్యక్షమైంది. ఆరోగ్య నిపుణుడు డాక్టర్‌ ఎరిక్‌ ఫెగిల్‌ డింగ్‌ ఈ వీడియోను ట్వీట్‌చేశారు. ఆత్మీయుల అంతిమ సంస్కారం కోసం ఇంకా ఎన్ని గంటలపాటు వేచి ఉండాలో తెలీకుండనే మృతదేహాలను క్యూ లైన్‌లో ఉంచి వేచిచూస్తున్న వందలాది మంది బంధువుల వేదన ఆ వీడియోలో కనిపించింది. కాగా, కట్టుతప్పిన కోవిడ్‌ సంక్షోభాన్ని వేగంగా అదుపుచేసి దేశంలో ఆరోగ్య పరిస్థితిని చక్కదిద్దాలని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ మేరకు చైనా అధికారిక వార్తా ప్రసార సంస్థ సీసీటీవీ ఒక ప్రకటన విడుదలచేసింది.

Covid Cases: 20 రోజుల్లోనే 25 కోట్ల మందికి కరోనా 
రోజూ లక్షల్లో కేసులు
ఝెజియాంగ్‌ ప్రావిన్స్‌లో రోజుకు 10 లక్షల కేసులు, తీరప్రాంత క్వింగ్‌దావో సిటీలో రోజుకు 5 లక్షల కేసులు, దోంగ్వాన్‌ సిటీలో రోజూ 2,50,000–3,00,000 కేసులు నమోదవుతున్నట్లు తెలుస్తోంది. సిచువాన్‌ ప్రావిన్స్‌లో లక్షన్నర జనాభాపై జరిపిన సర్వేలో 63 శాతం మంది తమకు కోవిడ్‌ సోకినట్లు వెల్లడించారు. వచ్చే ఏడాది చివరికల్లా చైనాలో 10 నుంచి 20 లక్షలలోపు జనం కోవిడ్‌తో కన్నుమూసే ప్రమాదముందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) ఉన్నతాధికారి ఒకరు హెచ్చరించారు. 

Pakistani Boat: రూ.300 కోట్ల విలువైన డ్రగ్స్‌తో పట్టుబడిన పాకిస్థాన్ బోటు
ఆయుధాలు, మందుగుండు సామగ్రితోపాటు రూ.300 కోట్ల విలువైన 40 కిలోల డ్రగ్స్, 10 మందితో గుజరాత్‌ తీరంవెంట భారత జలాల్లోకి ప్రవేశించిన పాక్‌ పడవను భారత తీర రక్షక దళం పట్టుకుంది. డిసెంబ‌ర్‌ 25న అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. అందులోని పదిమందిని అదుపులోకి తీసుకొని తదుపరి విచారణ నిమిత్తం ఓఖా పోర్టుకు తరలించారు. ఉగ్రవాద వ్యతిరేక బృందం (ATS) ఇచ్చిన సమాచారంతో అప్రమత్తమైన ఇండియన్ కోస్ట్ గార్డ్ డిసెంబరు 25-26 రాత్రి నోషనల్ అంతర్జాతీయ మారిటైమ్ బోర్డర్ లైన్ (IMBL) వద్ద ఫాస్ట్ పెట్రోల్ క్లాస్ షిప్ ఐసీజీఎస్ (ICGS) అరింజయ్‌తో గస్తీ కాసి ప‌ట్టుకుంది. 

New Variant BF7 : ఈ కొత్త వేరియంట్‌తో వీరికే ముప్పు ఎక్కువ‌.. ఎందుకంటే...?
కశ్మీర్‌లో భారీ ఆయుధ డంప్‌ 

జమ్మూకశ్మీర్‌లో సరిహద్దులకు సమీపంలోని ఉడిలో భారీగా ఆయుధ డంప్‌ బయటపడింది. ఇందులో 24 ఏకే–74 రైఫిళ్లు, 12 చైనీస్‌ పిస్టళ్లు, చైనీస్‌ హ్యాండ్‌ గ్రెనేడ్లు, 5 పాక్‌ తయారీ హ్యాండ్‌ గ్రెనేడ్లు, ఐ లవ్‌ పాకిస్తాన్‌ అని రాసి ఉన్న 81 బెలూన్లు భారీగా మందు గుండు సామగ్రి ఉన్నాయి. వీటిని తీవ్రవాదులకు అందించేందుకు దొంగచాటుగా పాక్‌ తరలించిందని అధికారులు 
తెలిపారు.   

US bomb cyclone: అమెరికాను ముంచేసిన మంచు 
అమెరికాలో హిమోత్పాతం దేశాన్ని గజగజ వణికిస్తోంది. మంచు తుపానులో చిక్కుకొని ఇప్పటివరకు 48 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో న్యూయార్క్‌ వాసులే 27 మంది ఉన్నారు. పశ్చిమ న్యూయార్క్‌లో కొన్ని ప్రాంతాలు 8 అడుగుల మేర మంచులో కూరుకుపోయాయి. ఏకధాటిగా మంచు కురుస్తూ ఉండడంతో ప్రజలు రోడ్లపైకి రావడం అసాధ్యంగా మారిందని న్యూయార్క్‌ గవర్నర్‌ వెల్లడించారు. దేశవ్యాప్తంగా 2 వేలకు పైగా విమానాలు రద్దయ్యాయి. దీంతో చికాగో, డెన్వర్, డెట్రాయిట్, న్యూయార్క్, అట్లాంటా విమానాశ్రయాల్లో ప్రయాణికులు చిక్కుకుపోయారు. కొలరాడో, కన్సాస్, కెంటకీ, మిస్సోరీ, ఓహియోలో ప్రాణనష్టం అధికంగా ఉంది. అమెరికాలో తూర్పు రాష్ట్రాలన్నీ డీప్‌ ఫ్రిజ్‌లో పెట్టినట్టుగా ఉన్నాయని అమెరికా నేషనల్‌ వెదర్ సర్వీసెస్‌ (ఎన్‌డబ్ల్యూఎస్‌) తెలిపింది. ఈ రాష్ట్రాల జనాభాలో 2 లక్షలకు మందికి పైగా విద్యుత్‌ సదుపాయం లేక విలవిలలాడిపోతున్నారు.

US Bomb Cyclone: మంచు గుప్పెట్లో అమెరికా.. మైనస్‌ 30కి ఉష్ణోగ్రతలు
ప్రజలు  ఇల్లు కదిలి బయటకు రావద్దని ఎన్‌డబ్ల్యూఎస్‌ హెచ్చరికలు జారీ చేసింది. అమెరికాలోని 48 రాష్ట్రాల్లో మైనస్‌ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మంచు తుఫాన్‌ హెచ్చరికలు జారీ అయిన ప్రాంతాల్లో కోటి మంది వరకు ఉండడం ఆందోళన కలిగిస్తోంది. న్యూయార్క్‌లోని బఫెల్లో ప్రాంతంలో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. కార్లలో ప్రయాణిస్తున్న వారిపై విపరీతంగా మంచుకురవడం వల్ల ఆ వాహనంలో మంచులో కూరుకుపోయి మృతి చెందిన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో ప్రజలు బయటకి రావడంపై ఆ ప్రాంతంలో నిషేధం విధించారు. విద్యుత్‌ సబ్‌ స్టేషన్లు 18 అడుగుల మంచులో కూరుకుపోవడంతో ఎప్పటికి కరెంట్‌ వస్తుందో తెలీని పరిస్థితి నెలకొంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆర్కిటిక్‌ బ్లాస్ట్‌తో అమెరికా ఈ శీతాకాలంలో గడ్డకట్టుకుపోయింది.

Telangana Farmers: దేశంలో తెలంగాణ‌ రైతుల స్థానం.. అప్పుల్లో 5, ఆదాయంలో 25
మన రైతన్నలు ఆ­దా­యంలో బాగా వెనుకంజలో ఉన్నారు. అప్పుల భారం కూడా భారీగానే ఉంది. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి. నెలకు సగటున రూ.10,218 ఆదాయం మాత్రమే పొందుతున్నాడు. అంటే రోజుకు రూ.340 మా­త్ర­మే. అదే సమయంలో ఒక్కో రైతుకు స­గటు­న రూ.74,121 అప్పు ఉంది. ఇక రాష్ట్ర రైతులు అప్పుల్లో దేశంలో ఐదో స్థానంలో, ఆదాయంలో 25వ స్థానంలో ఉంది. 2018 జూలై నుంచి 2019 జూన్‌ వరకు దేశంలోని వ్యవసాయ కుటుంబాలు, రైతుల అప్పు, ఆదాయంపై సర్వే జరిగింది. సర్వే వివరాలు ఇటీవల పార్లమెంటులో చర్చకు రాగా.. అందుకు సంబంధించి కేంద్ర వ్యవసాయ శాఖ ఓ నివేదిక విడుదల చేసింది. రైతు కోసం ఎన్ని పథకాలు తీసు­కొస్తున్నా రైతు పరిస్థితి పూర్తిస్థాయిలో బాగు­ప­డటం లేదు. స్వామినాథన్‌ సిఫారసు­ల ప్రకారం పంటలకు గిట్టుబాటు ధరలు ల­భిం­చ­కపోవడమే ఇందుకు కారణమని నిపు­ణులు చెబుతున్నారు.

వీక్లీ కరెంట్ అఫైర్స్ (సైన్స్ & టెక్నాలజీ) క్విజ్ (03-09 డిసెంబర్ 2022)
రోజుకు రూ.313 మాత్రమే
కేంద్రం విడుదల చేసిన నివేదిక ప్రకారం రాష్ట్ర రైతులు అప్పుల్లో దేశంలో ఐదో స్థానంలో నిలిచారు. తెలంగాణ రైతుల అప్పు సగటున రూ.1,52,113గా ఉంది. రైతు కుటుంబసభ్యుల సగటు ఆదాయం నెలకు రూ.9,403గా ఉంది. ఏడాదికి రూ.1,12,836. అంటే రోజుకు రూ.313 మాత్రమేనన్న మాట. ఇది ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సగటు జీతం కంటే దాదాపు సగం తక్కువ. ఇక ఆదాయంలో తెలంగాణ రైతు దేశంలో 25వ స్థానంలో ఉన్నాడని నివేదిక వెల్లడించింది. అత్యధికంగా మేఘాలయ రైతు సగటున నెలకు రూ. 29,348 ఆదాయం పొందుతున్నాడు. పంజాబ్‌ రైతు రూ. 26,701, హరియాణ రైతు రూ.22,841, అరుణాచల్‌ప్రదేశ్‌ రైతు రూ. 19,225 పొందుతున్నాడని కేంద్రం తెలిపింది. 

వీక్లీ కరెంట్ అఫైర్స్ (ఎకానమీ) క్విజ్ (25 నవంబర్ - 02 డిసెంబర్ 2022)

Draupadi Murmu: తొలిసారి తెలంగాణకు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 
దేశాధినేత పదవిని చేపట్టిన త‌రువాత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము డిసెంబ‌ర్ 26న తొలిసారిగా తెలంగాణకు వచ్చారు. శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి హైదరాబాద్‌లోని హకీంపేట ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌కు చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఆమెకు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. రాష్ట్రపతి హకీంపేట ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌ నుంచి బొల్లారంలోని యుద్ధస్తూపం వద్దకు చేరుకొని దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమర సైనికులకు నివాళి అర్పించారు. అనంత‌రం రాష్ట్రపతికి గవర్నర్‌ తమిళిసై  రాత్రి ఏడున్నర గంటల సమయంలో రాజ్‌భవన్‌లో విందు ఇచ్చారు. గవర్నర్‌తో కొనసాగుతున్న విభేదాల నేపథ్యంలోనే సీఎం విందుకు రాలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  
హైదరాబాద్‌కు వచ్చి.. శ్రీశైలం వెళ్లొచ్చి..
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తొలుత కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో కలిసి ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ గవర్నర్‌ తమిళిసై, మంత్రి సత్యవతిరాథోడ్‌ ఆమెకు స్వాగతం పలికారు. అక్క‌డి నుంచి ఆర్మీ హెలికాప్టర్‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వెళ్లారు. దర్శనం, ప్రత్యేక పూజల అనంతరం శ్రీశైలం నుంచి హకీంపేట ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌కు చేరుకున్నారు. 

Corona Virus: కరోనా ఫోర్త్‌ వేవ్‌తో మనకు ముప్పు లేదు

Korean Border: కొరియాల సరిహద్దుల్లో మళ్లీ ఉద్రిక్తతలు 
తమ గగనతలంలోకి చొచ్చుకువచ్చిన ఉత్తరకొరియా డ్రోన్లను దక్షిణ కొరియా సైన్యం తరిమి కొట్టింది. డిసెంబ‌ర్ 26న‌ ఉత్తరకొరియా ప్రయోగించిన ఐదు డ్రోన్లలో ఒకటి దక్షిణ కొరియా రాజధాని సియోల్‌కు అత్యంత సమీపంలోకి వచ్చింది. వీటిని పసిగట్టిన ఆర్మీ.. యుద్ధ విమానాలు, హెలికాప్టర్లతో ఆ డ్రోన్లను వెంబడించి 100 రౌండ్ల వరకు కాల్పులు జరిపింది. డ్రోన్లను కూల్చివేసిందీ లేనిదీ దక్షిణ కొరియా ఆర్మీ వెల్లడించలేదు. ఈ ఘటనలో తేలికపాటి యుద్ధ విమానం కేఏ–1 కూలిపోయింది. అందులోని ఇద్దరు పైలట్లు సురక్షితంగా బయటపడినట్లు తెలిపింది. అంతేకాదు, సరిహద్దుల ఆవల ఉత్తర కొరియా భూభాగంలోకి డ్రోన్లను పంపి, అక్కడి మిలటరీ స్థావరాలను చిత్రీకరించినట్లు సమాచారం.  

Hetero Nirmacom: హెటిరో నిర్మాకామ్‌కు డబ్ల్యూహెచ్‌వో ఆమోదముద్ర 
ఫార్మా దిగ్గజం హెటిరోకి చెందిన ’నిర్మాకామ్‌’(నిర్మాట్రెల్‌విర్‌) నాణ్యతా ప్రమాణాలకు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రీక్వాలిఫికేషన్‌ (డబ్ల్యూహెచ్‌వో పీక్యూ) ఆమోదముద్ర లభించింది. ఈ ఔషధాన్ని మరింత మందికి అందుబాటులోకి తెచ్చే దిశగా ఇది కీలక మైలురాయని కంపెనీ ఎండీ వంశీ కృష్ణ బండి తెలిపారు. భారత్‌తో పాటు 95 అల్పాదాయ, మధ్య స్థాయి ఆదాయ దేశాల్లో నిర్మాకామ్‌ను మరింత వేగంగా, చౌకగా అందుబాటులోకి  తెచ్చేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. కోవిడ్‌–19 చికిత్సలో ఉపయోగించే ఫైజర్‌ ఔషధం ప్యాక్స్‌లోవిడ్‌కు ఇది జనరిక్‌ వెర్షన్‌. నిర్మాట్రెల్‌విర్‌ 150 మి.గ్రా.(2 ట్యాబ్లెట్లు), రిటోనావిర్‌ 100 మి.గ్రా.(1 ట్యాబ్లెట్‌) అనే 2 యాంటీవైరల్‌ ఔషధాలు ఈ ప్యాక్‌లో ఉంటాయి. దీని తయారీ, విక్రయానికి సంబంధించి మెడిసిన్స్‌ పేటెంట్‌ పూల్‌ (ఎంపీపీ) నుంచి స్వచ్ఛంద లైసెన్సింగ్‌ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు హెటెరో తెలిపింది. ఈ లైసె న్స్‌ కింద జనరిక్‌ వెర్షన్‌ను రూపొందించిన తొలి సంస్థ హెటిరో కావడం ప్రశంసనీయమని ఎంపీపీ ఈడీ చార్లెస్‌ గోర్‌ తెలిపారు. దేశీయంగా అత్యవసర వినియోగం కోసం డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) నుంచి ఇప్పటికే అనుమతులు పొందినట్లు వివరించింది. 

వీక్లీ కరెంట్ అఫైర్స్ (వ్యక్తులు) క్విజ్ (25 నవంబర్ - 02 డిసెంబర్ 2022)

Venugopal Dhoot: ఐసీఐసీఐ బ్యాంక్‌ రుణ మోసం కేసులో వీడియోకాన్‌ ధూత్‌ అరెస్టు
ఐసీఐసీఐ బ్యాంక్‌ రుణ మోసం కేసులో వీడియోకాన్‌ గ్రూప్‌ వ్యవస్థాపకుడు వేణుగోపాల్‌ ధూత్‌ను (71) సీబీఐ అరెస్ట్‌ చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. కేసు విషయంలో డిసెంబ‌ర్ 26న‌ కొంత సేపు విచారణ చేసిన తర్వాత ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. డిసెంబర్‌ 23న అరెస్టయిన ఐసీఐసీఐ బ్యాంక్‌ సీఈవో చందా కొచర్, ఆమె భర్త దీపక్‌ కొచర్‌ల రిమాండ్‌పై విచారణ కోసం ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టడానికి కొద్ది గంటల ముందే ధూత్‌ను సీబీఐ అరెస్ట్‌ చేసింది. ముగ్గురితో పాటు మరికొందరు నిందితులపై సీబీఐ త్వరలో చార్జిషీట్‌ను దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. 2012లో చందా కొచర్‌ సీఈవోగా ఉన్నప్పుడు వీడియోకాన్‌కు ఐసీఐసీఐ బ్యాంక్‌ రూ.3,250 కోట్లు రుణాలు మంజూరు చేసినట్లు, ప్రతిగా ఆ కంపెనీ చీఫ్‌   ధూత్‌.. దీపక్‌ కొచర్‌ కంపెనీలో ఇన్వెస్ట్‌ చేసినట్లు ఆరోపణలున్నాయి. దీంతో చందా కొచర్, దీపక్‌ కొచర్, ధూత్‌తో పాటు న్యూపవర్‌ రెన్యువబుల్స్‌ వంటి సంస్థలను సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో చేర్చింది.

వీక్లీ కరెంట్ అఫైర్స్ (ఎకానమీ) క్విజ్ (03-09 డిసెంబర్ 2022) 

Published date : 27 Dec 2022 06:36PM

Photo Stories