‘దయాగుణం’లో మయన్మార్ ఫస్ట్ : ఫోర్బ్స్
Sakshi Education
తెరవాడ బుద్ధిజం.. గౌతమబుద్ధుని బోధనల్ని, నమ్మకాల్ని ఆచరిస్తూ ప్రచా రం చేసే ఒక వర్గమిది.
మయన్మార్‌లో పెద్దసంఖ్యలో ఉండే వీరు సంఘ దానాలకు ప్రాధాన్యమిస్తారు. తాజాగా ఫోర్బ్స్ విడుదల చేసిన ఒక జాబితా ప్రకారం అత్యధికంగా చారిటీలకు విరాళాలిచ్చే దేశాల జాబితా లో మయన్మార్ టాప్‌లో ఉంది. మయన్మార్‌లో ఏకంగా 81 శాతం మంది ప్రజలు చారిటీలకు విరాళాలిస్తున్నారని చారిటీస్ ఎయిడ్ ఫౌండేషన్స్ వరల్డ్ గివింగ్ ఇండెక్స్ వెల్లడిస్తోంది. థాయ్‌లాండ్‌లోనూ తెరవాడ బౌద్ధులు ఎక్కువే.. ఆ దేశంలో 71 శాతం మంది ప్రజలు వివిధ రూపాల్లో సాటి మనుషులకు సాయపడుతుంటారని తేలింది. సంపన్న రాజ్యమైన అమెరికా దయాగుణం గల టాప్-10 దేశాల్లో లేదు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: అత్యధికంగా చారిటీలకు విరాళాలిచ్చే దేశాల జాబితాలో మయన్మార్ టాప్-1
ఎందుకు: మయన్మార్‌లో ఏకంగా 81 శాతం మంది ప్రజలు చారిటీలకు విరాళాలిస్తున్నారు.
ఎక్కడ: మయన్మార్
క్విక్ రివ్యూ:
ఏమిటి: అత్యధికంగా చారిటీలకు విరాళాలిచ్చే దేశాల జాబితాలో మయన్మార్ టాప్-1
ఎందుకు: మయన్మార్‌లో ఏకంగా 81 శాతం మంది ప్రజలు చారిటీలకు విరాళాలిస్తున్నారు.
ఎక్కడ: మయన్మార్
Published date : 13 Nov 2019 06:03PM