ద్వారకా తిరుమల ఆలయానికి ఐఎస్‌వో గుర్తింపు
Sakshi Education
ఆంధ్రప్రదేశ్‌లో పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల క్షేత్రంలో శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానానికి ఐఎస్‌వో (ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్) గుర్తింపు లభించింది.
ఈ మేరకు ఫిబ్రవరి 11న గుర్తింపు ధ్రువపత్రాన్ని ఆలయ అధికారులకు ఐఎస్‌వో అందజేసింది. కార్యనిర్వహణ విధానం, భక్తులకు అవసరమైన సౌకర్యాల కల్పన తదితర అంశాల్లో ఉత్తమ ప్రమాణాలు పాటిస్తున్నందుకు ఆలయానికి ఐఎస్‌వో గుర్తింపు దక్కింది. రాష్ట్రంలో శ్రీశైలం దేవస్థానం గతంలో ఈ ధ్రువపత్రాన్ని అందుకుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ద్వారకా తిరుమల ఆలయానికి ఐఎస్‌వో గుర్తింపు
ఎప్పుడు : ఫిబ్రవరి 11
ఎక్కడ : ద్వారకాతిరుమల క్షేత్రం, పశ్చిమగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్
క్విక్ రివ్యూ :
ఏమిటి : ద్వారకా తిరుమల ఆలయానికి ఐఎస్‌వో గుర్తింపు
ఎప్పుడు : ఫిబ్రవరి 11
ఎక్కడ : ద్వారకాతిరుమల క్షేత్రం, పశ్చిమగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్
Published date : 12 Feb 2019 04:57PM