డ్రైస్వాబ్ కిట్లను అభివృద్ధి చేసిన సంస్థ?
Sakshi Education
కోవిడ్ వ్యాధి నిర్ధారణను వేగవంతం చేసే డ్రైస్వాబ్ కిట్లనుసెంటర్‌ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) అభివృద్ధి చేసింది.
ఈ డ్రైస్వాబ్ కిట్ల ద్వారా ఆర్‌టీ–పీసీఆర్ పరీక్షలు వేగంగా, చౌకగా జరుగుతాయి. భారత వైద్య పరిశోధన సమాఖ్య కూడా ఈ డ్రైస్వాబ్ కిట్ల వినియోగానికి అనుమతిచ్చిన నేపథ్యంలో వాటిని వాణిజ్యస్థాయిలో తయారు చేసేందుకు మెరిల్ డయాగ్నస్టిక్స్ ముందుకొచ్చింది. ఈ మేరకు దేశం మొత్తమ్మీద డ్రైస్వాబ్ ఆధారిత పరీక్షలను పెద్ద ఎత్తున చేపట్టేందుకు సీసీఎంబీ, మెరిల్ డయాగ్నస్టిక్స్ మధ్య ఒప్పందం కుదిరింది.
ఏమిటీ డ్రైస్వాబ్స్ టెక్నాలజీ?
కోవిడ్ వ్యాధి నిర్ధారణకు ముక్కు లేదా నోటి లోపల ఉండే ద్రవాలను పొడవాటిపుల్లల్లాంటి వాటితో సేకరిస్తారు. వీటినేస్వాబ్స్ అంటారు. ఆర్‌టీపీసీఆర్ టెస్టులు జరిగే కేంద్రాలకు ఈ నమూనాలను తీసుకెళ్లాలంటే వాటిని వైరల్ ట్రాన్స్‌పోర్ట్ మీడియం (వీటీఎం) ద్రావణంలో ఉంచి తీసుకెళ్లాల్సి ఉంటుంది. అంతేకాకుండా.. స్వాబ్స్‌లోని జీవ పదార్థాన్ని జాగ్రత్త పరిచేందుకు కొన్ని రీఏజెంట్లను కూడా వాడతారు. ఇవేవీ లేకుండా పొడిగా ఉండే స్వాబ్స్‌నే నేరుగా పరీక్షలు జరిగే కేంద్రాలకు తరలించేందుకు వీలుగా సీసీఎంబీ అభివృద్ధి చేసిన కొత్త టెక్నాలజీనే డ్రైస్వాబ్స్ టెక్నాలజీ. సాధారణ ఆర్‌టీపీసీఆర్ టెస్ట్ ద్వారా ఫలితాలకు ఒకట్రెండు రోజుల సమయం పడితే.. డ్రైస్వాబ్స్ టెక్నాలజీతో మూడు గంటల్లోనే ఫలితాలు తెలుసుకోవచ్చు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : డ్రైస్వాబ్ కిట్లను అభివృద్ధి చేసిన సంస్థ?
ఎప్పుడు :జూన్ 2
ఎవరు :సెంటర్‌ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ)
ఎందుకు :కోవిడ్ వ్యాధి నిర్ధారణను వేగవంతం చేసేందుకు...

Published date : 04 Jun 2021 02:27PM