Skip to main content

దక్షిణాసియా క్రీడల్లో భారత్‌కు అగ్రస్థానం

మూడున్నర దశాబ్దాల చరిత్ర కలిగిన దక్షిణాసియా క్రీడల్లో భారత్ తమ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది.
Current Affairsనేపాల్‌లోని కఠ్మాండు, పోఖరా నగరాల్లో డిసెంబర్ 10న ముగిసిన 13వ దక్షిణాసియా క్రీడల్లో భారత్ అత్యధికంగా 312 పతకాలు సాధించి పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఇందులో 174 స్వర్ణాలు, 93 రజతాలు, 45 కాంస్యాలు ఉన్నాయి. 2016లో స్వదేశంలో జరిగిన దక్షిణాసియా క్రీడల్లో భారత్ అత్యధికంగా 309 పతకాలు సాధించింది. 1984లో దక్షిణాసియా క్రీడలు మొదలుకాగా... ఇప్పటివరకు జరిగిన అన్ని క్రీడల్లోనూ పతకాల పట్టికలో భారతే అగ్రస్థానంలో నిలిచింది.

పతకాల పట్టిక
దేశం స్వర్ణం రజతం కాంస్యం మొత్తం
భారత్ 174 93 45 312
నేపాల్ 51 60 95 206
శ్రీలంక 40 83 128 251
పాకిస్తాన్ 31 41 59 131
బంగ్లాదేశ్ 19 32 87 138
మాల్దీవులు 1 0 4 5
భూటాన్ 0 7 13 20
నోట్: స్వర్ణాల సంఖ్య ఆధారంగా ర్యాంక్‌ను నిర్ణయిస్తారు.
Published date : 11 Dec 2019 05:34PM

Photo Stories