Skip to main content

దక్షిణాసియా ఆర్థిక పరిస్థితిపై ప్రపంచబ్యాంకు విడుదల చేసిన నివేదిక పేరు?

దక్షిణాసియా ప్రాంతం ఆర్థిక స్థితిగతులపై రూపొందించిన ‘దక్షిణాసియా ఆర్థిక పరిస్థితిపై దృష్టి’ అనే నివేదికను అక్టోబర్ 8న ప్రపంచ బ్యాంకు విడుదల చేసింది.
Current Affairs

ఈ నివేదిక ప్రకారం... దక్షిణాసియా ప్రాంతం ఆర్థిక వ్యవస్థ గడచిన ఐదేళ్ల నుంచీ వార్షికంగా 6 శాతం వృద్ధి నమోదుచేసుకోగా, 2020లో 7.7 శాతం క్షీణించనుంది. అయితే 2021లో ఈ ప్రాంతం 4.5 శాతం వృద్ధిని నమోదు చేసుకోవచ్చు.

భారత్ ఆర్థిక వ్యవస్థ...

  • భారత్ ఆర్థిక వ్యవస్థ 2020-2021 ఆర్థిక సంవత్సరంలో 9.6 శాతం క్షీణతను నమోదు చేసుకోవచ్చు.
  • కరోనా కట్టడికి విధించిన కఠిన లాక్‌డౌన్ పరిస్థితులు, గృహాలు, పరిశ్రమల ఆదాయాలు పడిపోవడం వంటి అంశాలు దీనికి కారణం.
  • భారత్ ఇంతకుముందెన్నడూ లేని దారుణ పరిస్థితులను ఎదుర్కొంటోంది.


భారత్ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి 2020-21లో అంచనాలను పరిశీలిస్తే (అంచనాలు శాతాల్లో)..

సంస్థ

క్షీణ అంచనా

కేర్

8.2

యూబీఎస్

8.6

ఎస్‌అండ్‌పీ

9

ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్

9

ఫిచ్

10.5

ఎస్‌బీఐ ఎకోర్యాప్

10.9

ఇక్రా

11

మూడీస్

11.5

ఇండియా రేటింగ్‌‌స అండ్ రీసెర్చ్

11.8

గోల్డ్‌మన్ శాక్స్

14.8


క్విక్ రివ్యూ :

ఏమిటి : దక్షిణాసియా ఆర్థిక పరిస్థితిపై దృష్టి పేరుతో నివేదిక విడుదల
ఎప్పుడు : అక్టోబర్ 8
ఎవరు : ప్రపంచ బ్యాంకు
ఎందుకు : దక్షిణాసియా ప్రాంతం ఆర్థిక స్థితిగతులపై
Published date : 10 Oct 2020 12:04PM

Photo Stories