Skip to main content

దక్కన్ సొసైటీకి ఈక్వేటరి అవార్డు

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ సమీపంలోని డీడీఎస్(దక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ)కి ఈక్వేటరి అవార్డు లభించింది.
2019 సంవత్సరానికిగాను 20 సంస్థలను ఈ అవార్డుకు ఎంపికచేయగా వాటిలో డీడీఎస్ సంస్థ ఉందని ఆ సంస్థ సంచాలకుడు పీవీ సతీష్ తెలిపారు. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన యునెటైడ్ నేషన్స్ డెవలప్ మెంట్ ప్రోగ్రాం(యూఎన్‌డీపీ) ఏటా ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణవేత్తలు, పర్యావరణ పరిరక్షణకు కృషిచేసే సంస్థలను గుర్తించి ఈ అవార్డును ప్రకటిస్తుంది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
యూఎన్‌డీపీ ఈక్వేటరి అవార్డు-2019
ఎప్పుడు : జూన్ 4
ఎవరు : జహీరాబాద్ డీడీఎస్(దక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ)
Published date : 05 Jun 2019 05:50PM

Photo Stories