దీక్ష కార్యక్రమంలో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం?
Sakshi Education
జాతీయ స్థాయిలో కేంద్రప్రభుత్వం విద్యాశాఖ ద్వారా అమలు చేస్తున్న ‘డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జి షేరింగ్’ (దీక్ష) కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలో మొదటి స్థానంలో నిలిచింది.
దీక్ష ద్వారా అత్యధిక లెర్నింగ్ సెషన్లు వినియోగించుకున్న మొదటి 10 రాష్ట్రాలు
క్విక్ రివ్యూ :
ఏమిటి : దీక్ష కార్యక్రమంలో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం?
ఎప్పుడు : జూన్ 18
ఎవరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
ఎక్కడ : దేశంలోనే
ఎందుకు : దీక్షలో అందుబాటులో ఉన్న కార్యక్రమాలను సమగ్రంగా అందిపుచ్చుకున్నందున...
దీక్ష కార్యక్రమంలో భాగంగా... దేశంలో డిజిటల్ విద్యను ప్రోత్సహించేందుకు జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్టీ) ద్వారా వివిధ కార్యక్రమాలను రూపొందించి దేశంలోని విద్యార్థులు, టీచర్లకు అందుబాటులో ఉంచింది. వీటిని అందిపుచ్చుకోవడంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందని కేంద్ర విద్యాశాఖ తాజాగా విడుదల చేసిన గణాంకాల్లో వెల్లడైంది.
దీక్ష గురించి కొన్ని అంశాలు..
దీక్ష గురించి కొన్ని అంశాలు..
- దీక్ష.. పాఠశాల విద్యకు ఒక జాతీయ వేదిక.
- ఓపెన్ ఆర్కిటెక్చర్, ఓపెన్ యాక్సెస్, ఓపెన్ లైసెన్సింగ్, స్వయంప్రతిపత్తి వంటి అంశాలతో దీక్షను అభివృద్ధి చేశారు.
- దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల విద్యార్థులు, టీచర్లలో పరిజ్ఞానం, నైపుణ్యాలు పెంపొందించే లక్ష్యంతో దీన్ని రూపొందించారు.
- 18కి పైగా భాషలతో పాఠ్యాంశాలు, నూతన బోధన విధానాలు ఇందులో ఉన్నాయి.
- ఎన్‌సీఈఆర్టీ, సీబీఎస్‌ఈతో పాటు అన్ని రాష్ట్రాల ఎస్సీఈఆర్టీల డిజిటల్ పాఠ్యాంశాలున్నాయి.
- దేశంలోని అన్ని రాష్ట్రాల మధ్య పరిజ్ఞానాన్ని పరస్పరం ఇచ్చిపుచ్చుకునేలా దీన్ని ఏర్పాటుచేశారు.
- దీక్షలో 1,61,135 పాఠ్యాంశాలు అందుబాటులో ఉన్నాయి. 10,810 మంది వీటిని పొందుపరిచారు.
- దీక్షలో 3,259 కోర్సులు ఉండగా 9,77,12,914 మంది చేరారు.
- ఇప్పటివరకు 1.50 కోట్ల సెషన్ల ద్వారా ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు, టీచర్లు ఈ దీక్ష పాఠ్యాంశాలను అభ్యసించారు.
- దేశం మొత్తం మీద ఇప్పటివరకు 320,10,03,963 లెర్నింగ్ సెషన్లను వినియోగించుకున్నారు.
దీక్ష ద్వారా అత్యధిక లెర్నింగ్ సెషన్లు వినియోగించుకున్న మొదటి 10 రాష్ట్రాలు
రాష్ట్రం | లెర్నింగ్ సెషన్లు (మిలియన్లలో) |
ఆంధ్రప్రదేశ్ | 15 |
బిహార్ | 14 |
గుజరాత్ | 6.03 |
ఉత్తరప్రదేశ్ | 4.67 |
జార్ఖండ్ | 4.64 |
తమిళనాడు | 2.97 |
మహారాష్ట్ర | 2.94 |
కర్ణాటక | 1.53 |
మధ్యప్రదేశ్ | 1.34 |
హిమాచల్ ప్రదేశ్ | 1.24 |
క్విక్ రివ్యూ :
ఏమిటి : దీక్ష కార్యక్రమంలో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం?
ఎప్పుడు : జూన్ 18
ఎవరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
ఎక్కడ : దేశంలోనే
ఎందుకు : దీక్షలో అందుబాటులో ఉన్న కార్యక్రమాలను సమగ్రంగా అందిపుచ్చుకున్నందున...
Published date : 19 Jun 2021 06:35PM