డీజీపీల జాతీయ సదస్సులో ప్రధాని మోదీ
Sakshi Education
మహారాష్ట్రలోని పుణెలో జరుగుతున్న 54వ డీజీపీ, ఐజీపీల జాతీయ సదస్సులో డిసెంబర్ 8న ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రధాని ప్రసంగిస్తూ... పోలీసుల గౌరవాన్ని పెంచేలా అధికారులు కృషి చేయాలని, సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు..ముఖ్యంగా మహిళలు, చిన్నారుల భద్రతపై విశ్వాసం పెంచాలని కోరారు. దేశ అవసరాలకు అనుగుణంగా చట్టాలను మార్చేందుకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు.
మరోవైపు పుణేలోని రాజ్‌భవన్‌లో డిసెంబర్ 7న జరిగిన ఆర్ముడ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. అక్కడే ఆయన 2016లో నగ్రోటా ఉగ్రదాడిలో నేలకొరిగిన మేజర్ కునాల్ గోసావి భార్య, కుమార్తెలతో మాట్లాడారు. అనంతరం ఫ్లాగ్ డే కార్యక్రమానికి సంబంధించిన 57 నిమిషాల వీడియోను ప్రధాని ట్విట్టర్‌లో విడుదల చేశారు.
ఉగ్రవాద శక్తులను నిర్వీర్యం చేయాలి
సార్క్ వ్యవస్థాపక దినోత్సవం(డిసెంబర్ 8) సందర్భంగా ప్రధాని మోదీ సార్క్ సెక్రటేరియట్‌కు లేఖ రాశారు. ఉగ్రవాదాన్ని సమష్టిగా ఎదుర్కోవడంతోపాటు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే శక్తులను అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సి ఉందని లేఖలో పేర్కొన్నారు. పాకిస్తాన్‌ను ఉద్దేశిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 54వ డీజీపీ, ఐజీపీల జాతీయ సదస్సు
ఎప్పుడు : డిసెంబర్ 8
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : పుణె, మహారాష్ట్ర

Published date : 09 Dec 2019 06:07PM