Skip to main content

డీహెచ్‌ఎఫ్‌ఎల్ డైరెక్టర్ల బోర్డు రద్దు

తీవ్రమైన రుణ సంక్షోభంలో చిక్కుకున్న దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్(డీహెచ్‌ఎఫ్‌ఎల్) కంపెనీ డైరెక్టర్ల బోర్డును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) నవంబర్ 20న రద్దు చేసింది.
Current Affairsఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు మాజీ ఎండీ ఆర్ సుబ్రమణియకుమార్‌ను ఆ కంపెనీ పాలనాధికారిగా (అడ్మినిస్ట్రేటర్) నియమించింది. జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ)లో డీహెచ్‌ఎఫ్‌ఎల్ దివాలా పరిష్కార ప్రణాళిక త్వరలోనే ప్రారంభమవుతుందని ఆర్‌బీఐ ప్రకటించింది.

రూ.500 కోట్లు, అంతకుమించి ఆస్తులు కలిగిన సమస్యాత్మక బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీలు), హౌసింగ్ ఫైనాన్‌‌స సంస్థలను (హెచ్‌ఎఫ్‌సీలు) దివాలా చట్టం (ఐబీసీ) కింద పరిష్కార చర్యల కోసం ఎన్‌సీఎల్‌టీకి ప్రతిపాదించే అధికారాన్ని ఆర్‌బీఐకి కట్టబెడుతూ కేంద్రప్రభుత్వం గతవారం నిర్ణయం తీసుకుంది. వెనువెంటనే డీహెచ్‌ఎఫ్‌ఎల్ విషయంలో ఆర్‌బీఐ తన అధికారాల అమలును ఆరంభించింది. దీంతో దివాలా చర్యల పరిష్కారానికి వెళ్లనున్న తొలి ఎన్‌బీఎఫ్‌సీ/హెచ్‌ఎఫ్‌సీ డీహెచ్‌ఎఫ్‌ఎల్ కానుంది. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ను రాజేష్ కుమార్ వాధ్వాన్ 1984లో ప్రారంభించారు. అల్పాదాయ, మధ్యతరగతి వర్గాలకు గృహ రుణాలిచ్చే ఉద్దేశంతో ఇది ఏర్పాటైంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి
: దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్(డీహెచ్‌ఎఫ్‌ఎల్) కంపెనీ డైరెక్టర్ల బోర్డు రద్దు
ఎప్పుడు : నవంబర్ 21
ఎవరు : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ)
ఎందుకు : తీవ్రమైన రుణ సంక్షోభంలో చిక్కుకున్నందున
Published date : 22 Nov 2019 06:29PM

Photo Stories