డీఎఫ్‌ఆర్‌ఎల్‌లో వ్యోమగాముల ఆహారం తయారు
Sakshi Education
ఇస్రో 2020 ఏడాది ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న గగన్‌యాన్ ప్రయోగంలో అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాముల కోసం మైసూరుకు చెందిన డిఫెన్స్ ఫుడ్ రీసెర్చ్ ల్యాబొరేటరీ (డీఎఫ్‌ఆర్‌ఎల్) పలు రకాల ఆహార పదార్థాలను సిద్ధం చేయనుంది.
ఇస్రో, కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ వంటకాలు తయారు చేయనుంది. ఇడ్లీ సాంబార్, ఎగ్ రోల్స్, వెజ్ రోల్స్, వెజ్ పులావ్‌తో పాటు మాంసాహారాన్ని వండిపెట్టనుంది. 32 ఆహార పదార్థాల జాబితాను ఇస్రోకు పంపించింది. ఈ ఆహారాలు కొన్ని నెలల పాటు పాడవకుండా, తాజాగా, పోషకాలతో ఉంటాయని డీఎప్‌ఆర్‌ఎల్ తెలిపింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత వ్యోమగాముల కోసం ఆహారం తయారు
ఎప్పుడు : జనవరి 7
ఎవరు : డిఫెన్స్ ఫుడ్ రీసెర్చ్ ల్యాబొరేటరీ (డీఎఫ్‌ఆర్‌ఎల్)
మాదిరి ప్రశ్నలు
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత వ్యోమగాముల కోసం ఆహారం తయారు
ఎప్పుడు : జనవరి 7
ఎవరు : డిఫెన్స్ ఫుడ్ రీసెర్చ్ ల్యాబొరేటరీ (డీఎఫ్‌ఆర్‌ఎల్)
మాదిరి ప్రశ్నలు
1. ఇస్రోకి చెందిన నేషనల్ అట్మాస్ఫియరిక్ రీసెర్చ లేబొరేటరీ (ఎన్ఏఆర్ఎల్) ఎక్కడ ఉంది?
1. అహ్మదాబాద్
2. బావ్‌నగర్
3. తిరుపతి
4. జోధ్‌పూర్
- View Answer
- సమాధానం : 3
2. డిఫెన్స్ ఫుడ్ రీసెర్చ్ ల్యాబొరేటరీ (డీఎఫ్‌ఆర్‌ఎల్) ఎక్కడ ఉంది?
1. మద్రాసు
2. జలహళ్లి
3. యశ్వంతపూర్
4. మైసూర్
- View Answer
- సమాధానం : 4
Published date : 08 Jan 2020 05:37PM