Skip to main content

డీఆర్‌డీవోలో శానిటైజింగ్‌ యంత్రాల అభివృద్ధి

కరోనా వైరస్‌పై యుద్ధంలో భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) మరో ముందడుగు వేసింది.
Current Affairs

వేర్వేరు ఉపరితలాల నుంచి వైరస్‌లను తొలగించేందుకు పూర్తి స్వదేశీ టెక్నాలజీతో శానిటైజింగ్‌ యంత్రాలను అభివృద్ధి చేసింది. ఢిల్లీలోని డీఆర్‌డీవో సంస్థ ‘ద సెంటర్‌ ఫర్‌ ఫైర్‌ ఎక్స్‌ప్లోజివ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్ ఎన్విరాన్‌మెంట్‌ సేఫ్టీ (సీఎఫ్‌ఈఈఎస్‌)’అభివృద్ధి చేసిన ఈ యంత్రాల్లో ఒకటి అవసరమైన చోటుకు మోసుకెళ్లేది కాగా, రెండోది చక్రాలపై ఉంచి తరలించగలిగేది. మంటలు ఆర్పేందుకు పనికొచ్చే యంత్రాలను రీడిజైనింగ్‌ చేయడం ద్వారా తాము ఈ శానిటైజింగ్‌ యంత్రాలను అభివృద్ధి చేసినట్లు డీఆర్‌డీవో ఏప్రిల్ 3న వెల్లడించింది. ప్రస్తుతం డీఆర్‌డీవో డైరెక్టర్‌గా జి.సతీశ్‌రెడ్డి ఉన్నారు.


కువైట్‌లో అత్యవసర క్షమాభిక్ష

కరోనా విజృంభిస్తోన్న ప్రస్తుత తరుణంలో కువైట్‌ దేశం సంచలన నిర్ణయం తీసుకుంది. తమ దేశంలో అక్రమంగా నివసిస్తోన్న, చిల్లర నేరాలకు పాల్పడిన విదేశీయులకు క్షమాభిక్ష పెడుతున్నట్లు ప్రకటించింది. స్వచ్ఛందంగా ముందుకు వస్తే వారందరినీ వారి మాతృదేశాలకు పంపేందుకు ఉచితంగా విమాన టికెట్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఏప్రిల్‌ 1 నుంచి దరఖాస్తులకు అవకాశం కల్పించింది.


క్విక్ రివ్యూ :

ఏమిటి : పూర్తి స్వదేశీ టెక్నాలజీతో శానిటైజింగ్‌ యంత్రాల అభివృద్ధి
ఎప్పుడు : ఏప్రిల్ 3
ఎవరు : భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో)
ఎందుకు : కరోనా వైరస్‌పై పోరుకు

Published date : 04 Apr 2020 04:33PM

Photo Stories