Skip to main content

డీఆర్‌డీవో సినర్జీ సమ్మిట్‌లో రాజ్‌నాథ్

పరిశ్రమ వర్గాలతో మరింత సమన్వయం కోసం నవంబర్ 22న హైదరాబాద్‌లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్‌లో ‘‘డీఆర్‌డీవో ఇండస్ట్రీ సినర్జీ సమ్మిట్ 2019’ జరిగింది.
Current Affairsఈ సమ్మిట్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. డీఆర్‌డీవో, రక్షణ పరిశ్రమ వర్గాలు సమష్టిగా పనిచేయాలని ఆయన ఆకాంక్షించారు. రక్షణ రంగ ఉత్పత్తుల తయారీ కోసం 1,800 పరిశ్రమలకుపైగా కలసి పనిచేస్తున్నాయని, ఇందులో డీఆర్‌డీవో పాత్ర ప్రశంసనీయం అన్నారు.

డీఆర్‌డీవో ఇండస్ట్రీ సినర్జీ సమ్మిట్‌కు ముఖ్యఅతిథిగా హాజరైన రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) చైర్మన్ డాక్టర్ జి.సతీశ్ రెడ్డి మాట్లాడుతూ.. రక్షణ రంగంలో దేశం స్వావలంబన సాధించేందుకు, పూర్తిస్థాయిలో స్వదేశీ టెక్నాలజీలను ఉపయోగించేందుకు ప్రైవేట్ రంగం కలసి రావాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం రక్షణ రంగంలో దేశీయ ఉత్పత్తుల భాగస్వామ్యం సుమారు 45 - 50 శాతం మాత్రమే ఉండగా.. రానున్న ఐదేళ్లలో దీన్ని 70 శాతానికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
డీఆర్‌డీవో ఇండస్ట్రీ సినర్జీ సమ్మిట్ 2019
ఎప్పుడు : నవంబర్ 22
ఎవరు : రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
ఎక్కడ : హైదరాబాద్
ఎందుకు : పరిశ్రమ వర్గాలతో మరింత సమన్వయం కోసం
Published date : 23 Nov 2019 05:48PM

Photo Stories