Skip to main content

డీఆర్‌డీవో చైర్మన్ సతీశ్‌ రెడ్డి పదవీకాలం పొడిగింపు

రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) చైర్మన్ జి.సతీశ్‌ రెడ్డి పదవీకాలాన్ని కేంద్రప్రభుత్వం రెండేళ్లు పొడిగించింది.
Current Affairs
ఈ మేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఆగస్టు 24న ఆదేశాలు జారీ చేసింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం మహిమలూరుకు చెందిన సతీశ్‌రెడ్డి2018 ఆగస్టులో రెండేళ్ల కాలానికి డీఆర్‌డీవో చైర్మన్ గా నియమితులయ్యారు. ఆగస్టు 26వ తేదీతో ఆయన పదవీకాలం ముగియనుండగా కేంద్రం ఆయనను కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ డిఫెన్స్ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (డీఓడీఆర్‌డీ) కార్యదర్శిగా కూడా సతీశ్‌ రెడ్డి బాధ్యతలు నిర్వహిస్తారు.

చదవండి: డీఆర్‌డీఓ చైర్మన్‌గా మొదటి తెలుగు వ్యక్తి

క్విక్ రివ్యూ :
ఏమిటి : డీఆర్‌డీవో చైర్మన్ సతీశ్‌ రెడ్డి పదవీకాలం పొడిగింపు
ఎప్పుడు : ఆగస్టు 24
ఎవరు : కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ
Published date : 25 Aug 2020 04:54PM

Photo Stories