డీఆర్‌డీఓ చైర్మన్‌కి రాయల్ ఏరోనాటికల్ ఫెలోషిప్
Sakshi Education
భారత రక్షణ రంగ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) చెర్మన్ గుండ్రా సతీష్‌రెడ్డికి లండన్‌కి చెందిన రాయల్ ఏరోనాటికల్ సొసైటీ గౌరవ ఫెలోషిప్ లభించింది.
ఏరోనాటికల్ ఆర్ట్ సైన్స్, ఇంజనీరింగ్ రంగాల్లో ఆయన సేవలకు గాను ఈ అవార్డు ప్రకటించినట్లు ఏరోనాటికల్ సొసైటీ నవంబర్ 26న తెలిపింది. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన ఈ ఏరోనాటికల్ సొసైటీలో భారతీయుడొకరికి ఈ ఘనత దక్కడం వందేళ్లలో ఇదే తొలిసారి. ఏరోస్పేస్ రంగంలో ఈ ఫెలోషిప్‌ను నోబెల్ పురస్కారానికి సమానంగా పరిగణిస్తారు. ఈ ఫెలోషిప్‌ను తొలిసారిగా 1917లో ప్రదానం చేశారు. విమానాన్ని కనిపెట్టిన రైట్ సోదరుల్లో ఒకరైన ఆర్విల్ రైట్‌కు అది దక్కింది. ఆ తర్వాత ఏరోస్పేస్ రంగంలో ఈ ఫెలోషిప్‌ను ఇస్తున్నారు. 2019 సంవత్సరానికి సతీశ్ రెడ్డికి దక్కింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : రాయల్ ఏరోనాటికల్ సొసైటీ గౌరవ ఫెలోషిప్
ఎప్పుడు : నవంబర్ 26
ఎవరు : డీఆర్‌డీఓ చెర్మన్ గుండ్రా సతీష్‌రెడ్డి
ఎందుకు : ఏరోనాటికల్ ఆర్ట్ సైన్స్, ఇంజనీరింగ్ రంగాల్లో సేవలకుగాను
క్విక్ రివ్యూ :
ఏమిటి : రాయల్ ఏరోనాటికల్ సొసైటీ గౌరవ ఫెలోషిప్
ఎప్పుడు : నవంబర్ 26
ఎవరు : డీఆర్‌డీఓ చెర్మన్ గుండ్రా సతీష్‌రెడ్డి
ఎందుకు : ఏరోనాటికల్ ఆర్ట్ సైన్స్, ఇంజనీరింగ్ రంగాల్లో సేవలకుగాను
Published date : 27 Nov 2019 05:37PM