డేవిడ్సన్ బైక్‌లపై భారీగా సుంకాలు : ట్రంప్
Sakshi Education
అమెరికా నుంచి భారత్‌కు దిగుమతవుతున్న హార్లే డేవిడ్సన్ బైక్‌లపై భారత్ భారీగా సుంకాలు విధిస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ మరోసారి విరుచుకుపడ్డారు.
గతంలో ఈ సుంకం వంద శాతంగా ఉండగా, నరేంద్ర మోదీ దీనిని 50 శాతానికి తగ్గించారు. అయినా సంతృప్తి చెందని ట్రంప్ బైక్ ధరలో దాదాపు సగం సుంకాలే ఉన్నాయని, ఇది అంగీకారయోగ్యం కాదని విమర్శించారు. ప్రతి దేశంతో సంబంధాలను ఆర్థిక దృష్టితో మాత్రమే చూసే డొనాల్ట్ ట్రంప్, భారత్‌ను టారిఫ్ కింగ్‌గా అభివర్ణించారు. కాగా, జపాన్‌లోని ఒసాకాలో జూన్ 28-29 మధ్య జీ20 సమావేశంలో మోదీతో ట్రంప్ సమావేశం కానున్నారు.
Published date : 12 Jun 2019 06:23PM