Skip to main content

దేశంలోని ఏ రాష్ట్రం ఫ్లోరైడ్ రహిత రాష్ట్రంగా అవతరించింది?

ఫ్లోరైడ్ రహిత రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం అవతరించింది.
Current Affairs
ఫ్లోరైడ్ రహిత రాష్ట్రంగా తెలంగాణలో ఫ్లోరైడ్ పీడిత గ్రామాల్లేవని పార్లమెంటు సాక్షిగా కేంద్రప్రభుత్వం సెప్టెంబర్ 18న ప్రకటించింది. ‘మిషన్ భగీరథ’పథకం ప్రవేశపెట్టడానికి ముందు.. అంటే 2015 ఏప్రిల్ 1నాటికీ రాష్ట్రంలో 976 ఫ్లోరైడ్ ప్రభావిత ఆవాసాలుండగా.. 2020, ఆగస్టు 1వ తేదీ నాటికీ ఈ సంఖ్య సున్నాకు చేరుకుంది. ఫ్లోరోసిస్ ప్రభావిత ప్రాంతాలకు మిషన్ భగీరథ కింద రక్షిత తాగునీరు అందించడంతో ఫ్లోరోసిస్ నిర్మూలన సాధ్యమైంది.

తొలిసారి దర్శిలో గుర్తింపు
భూగర్భజలాల్లో తొలిసారి ఫ్లోరైడ్ ఆనవాళ్లు 1937లో ప్రకాశం జిల్లా దర్శిలో, 1945లో నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం బట్లపల్లి(పాత)లో కనిపించాయి. 1985లో బట్లపల్లిలో ప్రపంచంలోనే అత్యధిక పరిమాణం(28 పీపీఎం)లో ఫ్లోరైడ్ ఉన్నట్టు తేలింది. అంగవైకల్యం.. అంతుపట్టని అనారోగ్యం.. మరుగుజ్జుతనం.. బుద్ధిమాంద్యం.. వయసు తగ్గట్టుగా ఎదగని శరీరం.. ఇవి ఫ్లోరైడ్ బారిన పడిన వారి ఆనవాళ్లు.

ఉత్తరాఖండ్, గుజరాత్‌లను కూడా...
తెలంగాణతోపాటు ఉత్తరాఖండ్, గుజరాత్‌లను కూడా ఫ్లోరైడ్ రహిత రాష్ట్రాలుగా గుర్తిస్తూ.. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో అధికారిక ప్రకటన చేసింది.

Current Affairs



క్విక్ రివ్యూ
:
ఏమిటి : ఫ్లోరైడ్ రహిత రాష్ట్రలుగా అవతరించిన రాష్ట్రాలు
ఎప్పుడు : సెప్టెంబర్ 18
ఎవరు : తెలంగాణ, ఉత్తరాఖండ్, గుజరాత్
ఎక్కడ : దేశంలో
Published date : 21 Sep 2020 05:28PM

Photo Stories