Skip to main content

దేశంలోని ఏ నగరంలో బీపీ డిజిటల్‌ హబ్‌ ఏర్పాటు కానుంది?

బ్రిటన్‌ చమురు దిగ్గజం బీపీ... మహారాష్ట్రలోని పుణే నగరంలో కొత్తగా డిజిటల్‌ సెంటర్‌ ఏర్పాటు చేయనుంది.
Current Affairs
2021, ఏడాది జూలై నాటికల్లా ఇందులో కార్యకలాపాలు ప్రారంభం కాగలవని జూన్ 1న కంపెనీ వెల్లడించింది. ప్రాథమికంగా ఇంజనీరింగ్, డేటా, ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ, డిజైన్‌ స్పెషలైజేషన్‌ తదితర విభాగాల్లో 100 మంది దాకా సిబ్బంది ఉంటారని వివరించింది. ప్రస్తుతం పుణేలో ఉన్న గ్లోబల్‌ బిజినెస్‌ సర్వీసెస్‌ (జీబీఎస్‌) ఆపరేషన్స్‌ సెంటర్‌ ఆవరణలోనే డిజిటల్‌ హబ్‌ కూడా ఉంటుందని పేర్కొంది. ప్రధాన కార్యకలాపాలు, కొత్త వ్యాపార విధానాలకు అవసరమైన డిజిటల్‌ సొల్యూషన్స్‌ను రూపొందించుకునేందుకు ఇది తోడ్పడుతుందని వివరించింది.

దేశీ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ భాగస్వామ్యంతో భారత్‌లో బీపీ చమురు, గ్యాస్‌ క్షేత్రాల అభివృద్ధి, మార్కెటింగ్‌ కార్యకలాపాలు కూడా సాగిస్తున్న సంగతి తెలిసిందే.

క్విక్ రివ్యూ :

ఏమిటి : త్వరలో కొత్తగా డిజిటల్‌ సెంటర్‌ ఏర్పాటు
ఎప్పుడు : జూన్ 1
ఎవరు : బ్రిటన్‌ చమురు దిగ్గజం బీపీ
ఎక్కడ : పుణే, మహారాష్ట్ర
ఎందుకు :ప్రధాన కార్యకలాపాలు, కొత్త వ్యాపార విధానాలకు అవసరమైన డిజిటల్‌ సొల్యూషన్స్‌ను రూపొందించుకునేందుకు
Published date : 04 Jun 2021 12:27PM

Photo Stories