దేశంలోనే తొలి మహిళా హిప్నాటిస్ట్ ఎవరు?
Sakshi Education
ప్రముఖ సైకలాజికల్ హిప్నాటిస్ట్ డాక్టర్ హిప్నో కమలాకర్(53) కన్నుమూశారు.
గుండెపోటు కారణంగా సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో ఏప్రిల్ 21న తుదిశ్వాస విడిచారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజమండ్రి సమీపంలోని నాగుల్లంకకు చెందిన కమలాకర్... 15 ఏళ్లుగా హైదరాబాద్ అశోక్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు. జర్నలిస్ట్, న్యాయవాదిగా పనిచేయడంతోపాటు రెండు దశాబ్దాలుగా స్టేజీ హిప్నాటిస్ట్‌గా ఆయన ప్రాచుర్యం పొందారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా చాలా కాలం పనిచేశారు. కమలాకర్ సతీమణి డాక్టర్ హిప్నో పద్మాకమలాకర్ దేశంలోనే తొలి మహిళా హిప్నాటిస్ట్.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రముఖ సైకలాజికల్ హిప్నాటిస్ట్ కన్నుమూత
ఎప్పుడు : ఏప్రిల్ 21
ఎవరు : డాక్టర్ హిప్నో కమలాకర్(53)
ఎక్కడ : హైదరాబాద్
ఎందుకు : గుండెపోటు కారణంగా...
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రముఖ సైకలాజికల్ హిప్నాటిస్ట్ కన్నుమూత
ఎప్పుడు : ఏప్రిల్ 21
ఎవరు : డాక్టర్ హిప్నో కమలాకర్(53)
ఎక్కడ : హైదరాబాద్
ఎందుకు : గుండెపోటు కారణంగా...
Published date : 22 Apr 2021 07:38PM