Skip to main content

దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన రైలుగా శతాబ్ది

దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన రైలుగా సికింద్రాబాద్ - పుణే మధ్య నడుస్తోన్న పుణే- సికింద్రాబాద్ శతాబ్ది రైలు నిలచింది.
ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ ) నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది.ఈ రైలు సెంట్రల్ రైల్వే జోన్ నుంచి దక్షిణ మధ్య రైల్వే కేంద్రాల మధ్య నడుస్తోంది. ఈ రైలు బయల్దేరేటప్పుడు తీసుకుంటున్న పరిశుభ్రతా చర్యలే దీనికి అరుదైన గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఈ ఘనత సాధించడం వెనుక దక్షిణమధ్య రైల్వే పాత్ర కూడా ఉంది. రైలు పుణే నుంచి బయల్దేరినా.. సికింద్రాబాద్ చేరుకున్నాక కూడా రెండో నిర్వహణలో భాగంగా గంట పాటు రైలును మరోసారి శుభ్రపరిచి ప్రయాణానికి సిద్ధం చేస్తారు. దేశంలో నడుస్తున్న మొత్తం 26 ప్రీమియం రైళ్లలో ఈ రైలు పరిశుభ్రతకే అధిక శాతం మంది ప్రయాణికులు ఓటేయడం విశేషం. మొత్తం 1,000 పాయింట్లకు గాను ఈ రైలు 916 పాయింట్లు సాధించింది.

దక్షిణ మధ్య రైల్వేకు ఆఖరు స్థానం..
స్వచ్ఛ్‌రైల్ స్వచ్ఛ్ భారత్ మిషన్‌లో భాగంగా పురోగతి తెలుసుకునేందుకు, పరిశుభ్రత విషయంలో రైళ్ల మధ్య పోటీ పెంచేందుకు ఐఆర్‌సీటీసీ టోటల్ క్లీన్‌లైన్స్ పేరిట ఈ సర్వే నిర్వహించింది. మొత్తం 209 రైళ్లలో ప్రయాణికుల వద్ద అభిప్రాయాలు సేకరించింది. ఈ సర్వేలో జైపూర్ కేంద్రంగా నడిచే వాయవ్య రైల్వే అగ్రస్థానంలో నిలిచింది. మొత్తం 1,000 పాయింట్లకు 860 పాయింట్లు సాధించింది. ఈ సర్వేలో దక్షిణమధ్య రైల్వేకు 658 పాయింట్లతో ఆఖరు స్థానం దక్కింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి:
దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన రైలుగా శతాబ్ది రైలు
ఎందుకు: అత్యంత పరిశుభ్రతపాటించినందుకు
Published date : 24 Jan 2019 05:38PM

Photo Stories