దేశంలో ఉద్యోగార్థులు అత్యంత ఎక్కువగా ఇష్టపడే నగరం
వీబాక్స్, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ), టాగ్డ్ సంస్థ సంయుక్తంగా రూపొందించిన ‘ఇండియా స్కిల్స్ రిపోర్ట్-2021’ లో ఈ విషయం వెల్లడించింది. అలాగే ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉన్న నగరాల్లోనూ హైదరాబాదే తొలి స్థానంలో ఉంది. హైదరాబాద్ తర్వాత బెంగళూరు, పుణే, ఢిల్లీ ఉద్యోగానికి అనువైన నగరాలుగా, ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉన్న సిటీలుగా నిలిచాయి.
ఉద్యోగం చేసేందుకు ఎక్కువగా ఇష్టపడే నగరాలు.. ర్యాంకు నగరం 1 హైదరాబాద్ 2 బెంగళూరు 3 పుణే 4 ఢిల్లీ 5 చెన్నై 6 లక్నో 7 కోయంబత్తూర్ 8 నెల్లూరు 9 గుర్గావ్ 10 మంగళూరు