దేశంలో తొలి టాయ్ ఫెయిర్ ప్రారంభం
Sakshi Education
దేశంలో తొలి ‘టాయ్ ఫెయిర్–2021’ను ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 27న ప్రారంభించారు.
వర్చువల్ విధానంలో మార్చి 2 వరకు జరగనున్న ఈ టాయ్ ఫెయిర్‌లో వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి వెయ్యికి పైగా ఎగ్జిబిటర్లు పాల్గొంటున్నారు. ఈ టాయ్ ఫెయిర్‌కు ప్రఖ్యాత టాయ్ సంస్థ ‘హామ్లీ’ టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. టాయ్ ఫెయిర్‌లో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ... బొమ్మల రంగంలో ఆత్మనిర్భర్ (స్వయం సమృద్ధి) సాధించాలని పిలుపునిచ్చారు. భారత్‌లోని బొమ్మల్లో 85 శాతం బొమ్మలు విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నవేనని గుర్తుచేశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : దేశంలో తొలి టాయ్ ఫెయిర్–2021 ప్రారంభం
ఎప్పుడు : ఫిబ్రవరి 27
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : వర్చువల్ విధానంలో
క్విక్ రివ్యూ :
ఏమిటి : దేశంలో తొలి టాయ్ ఫెయిర్–2021 ప్రారంభం
ఎప్పుడు : ఫిబ్రవరి 27
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : వర్చువల్ విధానంలో
Published date : 01 Mar 2021 06:11PM