దేశంలో తొలి కిసాన్ రైలు ప్రారంభం
దేశంలో తొలి కిసాన్ రైలు 2020, ఆగస్టు 7న ప్రారంభమైంది. మహారాష్ట్రలోని దేవ్‌లాలి నుంచి బీహార్‌లోని దానాపూర్‌కి వరకు బయలుదేరిన ఈ రైలును కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ సర్వీసు ప్రస్తుతానికి వారానికి ఒకసారి దేవ్‌లాలి నుంచి ప్రతి శుక్రవారం, తిరుగుప్రయాణంలో ప్రతి ఆదివారం దానాపూర్ నుంచి బయలుదేరుతుంది. రైతుల కోసం తెచ్చిన కిసాన్ రైల్‌లోరిఫ్రిజిరేటర్ కోచ్‌లు ఉంటాయి. త్వరగా పాడైపోయే పండ్లు, కూరగాయలు వంటి వాటిని తరలించడానికి రైలు ఉపయుక్తంగా ఉంటుంది. తక్కువ ధరలకే రైతుల పంటలను రవాణా చేసేందుకు కిసాన్ రైలు ఉపకరిస్తుందని మంత్రి తోమర్ వెల్లడించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : దేశంలో తొలి కిసాన్ రైలు ప్రారంభం
ఎప్పుడు : ఆగస్టు 7, 2020
ఎవరు : కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్
ఎక్కడ : మహారాష్ట్రలోని దేవ్‌లాలి నుంచి బీహార్‌లోని దానాపూర్‌కి వరకు
ఎందుకు :త్వరగా పాడైపోయే పండ్లు, కూరగాయలు వంటి వాటిని తరలించడానికి