Skip to main content

దేశంలో సామాజిక అత్యవసర పరిస్థితి

దేశంలో ప్రస్తుతం ‘సామాజిక అత్యవసర పరిస్థితి(సోషల్‌ ఎమర్జెన్సీ)’ తరహా అసాధారణ స్థితి నెలకొని ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.
Current Affairsకరోనా కారణంగా నెలకొన్న ఈ స్థితి వల్ల కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తోందన్నారు. ప్రతీ ప్రాణాన్ని కాపాడటమే ప్రస్తుతం ప్రభుత్వం ముందున్న ప్రధాన లక్ష్యమన్నారు. కరోనా వ్యాప్తిని కట్టడి చేసేలా అప్రమత్తతను కొనసాగించాలని కోరారు. పార్లమెంట్‌లోని విపక్ష, ఇతర పార్టీల ఫ్లోర్‌ లీడర్లతో ఏప్రిల్ 8న ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా నేతల సూచనలను స్వీకరించారు.

2020–21లో వృద్ధి 1.6 శాతమే.గోల్డ్‌మాన్‌ శాక్స్‌
కరోనా వైరస్‌ మహమ్మారి కట్టడికి లాక్‌డౌన్‌ అమలు చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్‌ వృద్ధి రేటు పలు దశాబ్దాల కనిష్ట స్థాయికి పడిపోనుందని అమెరికన్‌ బ్రోకరేజీ సంస్థ గోల్డ్‌మన్‌ శాక్స్ తెలిపింది. 2020–21లో భారత్‌ వృద్ధి రేటు 1.6 శాతమే ఉండవచ్చని అంచ‌నా వేసింది. సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు భారత విధానకర్తలు అవసరమైనంత దూకుడుగా వ్యవహరించడం లేదని అభిప్రాయపడింది. గతంలో వచ్చిన మాంద్యాలతో పోలిస్తే ప్రస్తుతం భిన్న పరిస్థితి నెలకొందని, అప్పట్లో లేనంతగా ప్రస్తుతం ప్రజల్లో తీవ్ర భయాందోళనలు ఉన్నాయని తెలిపింది. ఇప్పటికే పలు రేటింగ్‌ ఏజెన్సీలు భారత వృద్ధి రేటు అంచనాలను సుమారు 2 శాతం స్థాయికి కుదించిన సంగతి తెలిసిందే.

ప్యాకేజీ సరిపోదు..
కరోనా సవాళ్లను ఎదుర్కొనే దిశగా ప్రభుత్వం ప్రకటించిన రూ. 1.75 లక్షల కోట్ల ప్యాకేజీ, ముప్పావు శాతం మేర రిజర్వ్‌ బ్యాంక్‌ వడ్డీ రేట్ల కోత సరిపోదని.. అంతకు మించి చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని గోల్డ్‌మన్‌ శాక్స్‌ తెలిపింది. స్థూల దేశీయోత్పత్తిలో(జీడీపీ) 60 శాతం ఉండే వినియోగం.. లాక్‌డౌన్‌ కారణంగా గణనీయంగా పడిపోవచ్చని పేర్కొంది.
Published date : 09 Apr 2020 06:51PM

Photo Stories