Skip to main content

దేశంలో బ్లూఫ్లాగ్ బీచ్‌లుగా ఎంపికైన బీచ్‌లు ఏవీ.. వాటి సంఖ్య ఎంత?

విశాఖ రుషికొండ బీచ్‌కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. పర్యావరణహిత, ప్రమాదరహిత బీచ్‌లకు అందించే బ్లూఫ్లాగ్ సర్టిఫికెట్‌ని అక్టోబర్ 11న ఈ బీచ్ దక్కించుకుంది.
Current Affairs
బ్లూఫ్లాగ్ ఇంటర్నేషనల్ జ్యూరీ బృందం ఆయా బీచ్‌ల్లో నిర్వహించిన పనుల్ని వర్చువల్ ద్వారా పరిశీలించింది. అనంతరం దేశంలో 13 బీచ్‌ల నుంచి ఎనిమిది బీచ్‌లు బ్లూఫ్లాగ్ సర్టిఫికెట్‌కు ఎంపికయ్యాయని వెల్లడించింది.

మూడో స్థానంలో...
తీర ప్రాంతాల్లో కాలుష్య నియంత్రణకు భారత్ తీసుకుంటున్న విధానాలు అద్భుతంగా ఉన్నాయని, బెస్ట్ ప్రాక్టీసెస్ విభాగంలో ఇండియా మూడో స్థానంలో నిలిచిందని బ్లూఫ్లాగ్ బీచెస్ ఆఫ్ ఇండియా మిషన్ లీడర్ సంజయ్ జల్లా ప్రకటించారు.

బ్లూఫ్లాగ్ గుర్తింపు వల్ల లాభమేంటి? ఆ సర్టిఫికెట్‌ని అందించే సంస్థ ఏది?
ప్రపంచవ్యాప్తంగా బ్లూఫ్లాగ్ బీచ్‌లకు విశేష ఆదరణ ఉంటుంది. విదేశీ పర్యాటకులు ముందుగా బ్లూఫ్లాగ్ బీచ్‌నే ఎంపిక చేసుకుంటారు. ఈ సర్టిఫికెట్‌ని పొందాలంటే బీచ్ పర్యావరణహితంగా ఉండటంతోపాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి. ఎలాంటి రసాయనాలు బీచ్ పరిసరాల్లో కలవకుండా చూడాలి. ఈ సర్టిఫికెట్‌ని డెన్మార్క్‌కి చెందిన ఫౌండేషన్ ఆఫ్ ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ (ఎఫ్‌ఈఈ) సంస్థ అందిస్తోంది. ఇప్పటివరకు 46 దేశాల్లో 4,500 బీచ్‌లు బ్లూఫ్లాగ్ సర్టిఫికెట్‌ని పొందాయి.

దేశంలో బ్లూఫ్లాగ్ బీచ్‌లుగా ఎంపికై నవి ఇవే..
1. రుషికొండ బీచ్ (ఆంధ్రప్రదేశ్)
2. గోల్డెన్ బీచ్ (ఒడిశా)
3. రాధానగర్ బీచ్ (అండమాన్)
4. కప్పడ్ బీచ్ (కేరళ)
5. పదుబిద్రి బీచ్ (కర్ణాటక)
6. కాసర్‌కోడ్ బీచ్ (కర్ణాటక)
7. ఘోగ్లా బీచ్ (డయ్యూ)
8. శివరాజ్‌పూర్ బీచ్ (గుజరాత్)

క్విక్ రివ్యూ :

ఏమిటి : బ్లూఫ్లాగ్ బీచ్‌లుగా 8 బీచ్‌లు ఎంపిక
ఎప్పుడు : అక్టోబర్ 11
ఎవరు : ఫౌండేషన్ ఆఫ్ ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ (ఎఫ్‌ఈఈ) సంస్థ
ఎక్కడ : దేశ వ్యాప్తంగా
Published date : 15 Oct 2020 06:05PM

Photo Stories