దేశంలో 10 వేల జనాభాకు 8 మందే డాక్టర్లు
Sakshi Education
భారత్‌లో ప్రతీ 10 వేల జనాభాకు ఎనిమిది మంది కంటే కొంచెం తక్కువగానే డాక్టర్లు ఉన్నారని ప్రముఖ అంతర్జాతీయ మెడికల్ జర్నల్ లాన్సెట్ తెలిపింది.
కరోనా నేపథ్యంలో అంతర్జాతీయంగా వివిధ దేశాల పరిస్థితిని విశ్లేషిస్తూ, భారత్‌లో పరిస్థితిపైనా తాజాగా ఒక నివేదికను లాన్సెట్ విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం...
- మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్ రాష్ట్రాలు అత్యధికంగా కరోనాతో దెబ్బతిన్నాయి. ఆయా రాష్ట్రాల్లో ప్రభావిత ప్రాంతాల్లో సైన్యాన్ని మోహరించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
- దేశంలో వైరస్ మరింత వేగంగా వ్యాప్తి చెందడానికి అవకాశాలున్నాయి.
- లాక్‌డౌన్ సమయంలో ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయడంలో దేశవ్యాప్తంగా వైఫల్యం జరిగింది.
- ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలను సమర్థవంతంగా ఉపయోగించలేదు.
- ప్రపంచ జనాభాలో 66 శాతం మంది పేదలున్నారు. ఆ వర్గాలను మరింత పేదలుగా మార్చే దుస్థితి కరోనా కారణంగా ఏర్పడింది.
- కరోనా రష్యాలో కూడా ఉధృతంగా కొనసాగుతోంది. ఇది మధ్య ఆసియా గుండా మధ్యప్రాచ్యం, భారత ఉపఖండంలోకి ప్రవేశించేలా ఒక బలమైన గొలుసుకట్టును ఏర్పరుచుకుంది.
Published date : 15 Jul 2020 03:24PM