దేశమంతా ఒకే రేషన్ కార్డు అమలు
Sakshi Education
దేశంలో ఏ రేషన్ దుకాణం నుంచైనా సరుకులు తీసుకునే వీలుండేలా ఒకే దేశం.. ఒకే రేషన్ కార్డు..’ అమలు దిశగా చర్యలు చేపడుతున్నట్లు కేంద్ర ఆహార శాఖ మంత్రి రామ్‌విలాస్ పాసవాన్ వెల్లడించారు.
ఢిల్లీలో ఆహారభద్రతపై సంబంధిత రాష్ట్రాల కార్యదర్శులు, భారత ఫుడ్ కార్పొరేషన్ (ఎఫ్‌సీఐ), కేంద్ర, రాష్ట్ర వేర్‌హౌసింగ్ కార్పొరేషన్‌ల (సీడబ్ల్యూసీ, ఎస్‌డబ్ల్యూసీ) అధికారులతో జూన్ 27న నిర్వహించిన సదస్సు సందర్భంగా మంత్రి ఈ మేరకు తెలిపారు. దేశమంత ఒకే రేషన్ కార్డు విధానం ద్వారా కార్డుదారులందరికీ.. ప్రత్యేకించి ఉపాధిని వెతుక్కుంటూ ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస వెళ్లేవారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : దేశమంతా ఒకే రేషన్ కార్డు అమలుకు చర్యలు
ఎప్పుడు : జూన్ 27
ఎవరు : కేంద్ర ఆహార శాఖ మంత్రి రామ్‌విలాస్ పాసవాన్
క్విక్ రివ్యూ :
ఏమిటి : దేశమంతా ఒకే రేషన్ కార్డు అమలుకు చర్యలు
ఎప్పుడు : జూన్ 27
ఎవరు : కేంద్ర ఆహార శాఖ మంత్రి రామ్‌విలాస్ పాసవాన్
Published date : 28 Jun 2019 06:17PM