Skip to main content

దేశీయ థర్మామీటర్, ఫేస్‌ మాస్క్‌ ఆవిష్కరణ

ఆంధ్రప్రదేశ్‌ మెడ్‌టెక్‌ జోన్‌కు చెందిన గ్రీన్‌ ఓషన్‌ రీసెర్చ్‌ లాబ్స్‌ రూపొందించిన ఇన్‌ ఫ్రా రెడ్‌ నాన్‌ కాంటాక్ట్‌ ఫోర్‌ హెడ్‌ థర్మామీటర్, ప్రొటెక్టివ్‌ ఫేస్‌ మాస్క్‌లను ఏప్రిల్ 22న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆవిష్కరించారు.
Current Affairs

సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆ మాస్క్, థర్మామీటర్‌ పని తీరును ఏపీ మెడ్‌టెక్‌ జోన్‌కు చెందిన గ్రీన్‌ ఓషన్‌ రీసెర్చ్‌ ల్యాబ్స్‌ డైరెక్టర్స్‌ ఏ శృతి, ఎం సాయిరాం ముఖ్యమంత్రికి వివరించారు.

  • తొలిసారి దేశీయంగా ఇన్‌ ఫ్రా రెడ్‌ నాన్‌ కాంటాక్ట్‌ ఫోర్‌ హెడ్‌ థర్మామీటర్, ప్రొటెక్టివ్‌ ఫేస్‌ మాస్క్‌లు తయారు చేస్తున్నామని చెప్పారు. అతి తక్కువ ఖర్చుతో స్థానికంగా ఉన్న ఉద్యోగులతోనే ఈ పరికరాలను తయారు చేస్తున్నామని వెల్లడించారు.
  • కోవిడ్‌–19 వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా స్థానికంగా అందుబాటులో ఉన్న ఉద్యోగులతోనే ఉత్పత్తి చేస్తున్నామని తెలిపారు.
  • ప్రస్తుతం రోజుకు 1,000 థర్మామీటర్లు తయారు చేస్తున్నామని, మన రాష్ట్ర అవసరాల అనంతరం త్వరలోనే ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసే దిశగా ఉత్పత్తిని పెంచుతామని వారు ముఖ్యమంత్రికి వివరించారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : ఇన్‌ ఫ్రా రెడ్‌ నాన్‌ కాంటాక్ట్‌ ఫోర్‌ హెడ్‌ థర్మామీటర్, ప్రొటెక్టివ్‌ ఫేస్‌ మాస్క్‌ల ఆవిష్కరణ
ఎప్పుడు : ఏప్రిల్ 22
ఎవరు : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి
ఎక్కడ : సీఎం క్యాంపు కార్యాలయం, ఆంధ్రప్రదేశ్
Published date : 23 Apr 2020 08:30PM

Photo Stories