దేశ జీడీపీలో ప్రభుత్వ అప్పులు ఎంత శాతంగా ఉన్నాయి?
ఎంపీ సజ్దా అహ్మద్ అడిగిన ప్రశ్నకు మంత్రి ఆగస్టు 9న లోక్‌సభలో రాతపూర్వక సమాధానం ఇచ్చారు. ‘ద్రవ్య లోటు తగ్గింపు చర్యలు, పన్నుల ఎగవేతను నివారించి పన్నుల ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచుకోవడం, ప్రభుత్వ రంగ సంస్థలు, వాటి స్థలాల అమ్మకం, ఆస్తుల ద్వారా ఆదాయ సముపార్జన వంటి అదనపు చర్యల వల్ల కేంద్ర ప్రభుత్వానికి చెల్లింపు సామర్థ్యం సమకూరుతుంది..’ అని మంత్రి నిర్మలా పేర్కొన్నారు.
9వ విడత ‘పీఎం–కిసాన్’ విడుదల
దేశవ్యాప్తంగా రైతన్నల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు చేపట్టినట్లు ప్రధాని మోదీ చెప్పారు. ఆయన ఆగస్టు 9న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి(పీఎం–కిసాన్) పథకం కింద తొమ్మిదో విడతలో 9.75 కోట్ల మందికిపైగా రైతుల ఖాతాల్లోకి రూ.19,500 కోట్లు బదిలీ చేశారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో పంటల సాగుకు పీఎం–కిసాన్ సొమ్ము రైతాంగానికి ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.