Skip to main content

దేశ జీడీపీలో కుటుంబాల రుణ భారం ఎంత శాతంగా ఉంది?

కరోనా ప్రేరిత సవాళ్ల నేపథ్యంలో 2020–21 ఆర్థిక సంవత్సరంలో భారత్‌లో కుటుంబాలపై రుణ భారాలు తీవ్రమయ్యాయని జూలై 5న విడుదలైన ఎస్‌బీఐ రిసెర్చ్‌ నివేదిక పేర్కొంది.
Current Affairs నివేదిక ప్రకారం.. 2019–20 ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో కుటుంబాల రుణ భారం 32.5 శాతం అయితే, ఇది 2020–21 ఆర్థిక సంవత్సరంలో 37.3 శాతానికి పెరిగింది.

రుణాల్లో ఏమున్నాయంటే...
బ్యాంకులు, క్రెడిట్‌ సొసైటీలు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు, హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల వంటి ఫైనాన్షియల్‌ సంస్థల నుంచి రిటైల్‌సహా వ్యవ సాయ, వ్యాపార రుణాలు ఈ కేటగిరీ కిందకు వస్తాయి.

అగ్ర దేశాలకన్నా తక్కువే!
దేశ జీడీపీలో కుటుంబ రుణ భారాల నిష్పత్తి ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో మరింత పెరిగే అవకాశం ఉందని నివేదిక అంచనావేస్తోంది. జీడీపీలో కుటుంబాల రుణ నిష్పత్తి 37 శాతం అంటే మిగిలిన పలు దేశాలకన్నా ఇది తక్కువేనని ఎస్‌బీఐ అధికారులు పేర్కొన్నారు. దక్షిణ కొరియా (103.8 శాతం), బ్రిటన్‌ (90 శాతం), అమెరికా (79.5 శాతం), జపాన్‌ (65.3 శాతం), చైనా (61.7 శాతం)లను ఈ సందర్భంగా ప్రస్తావించారు. మెక్సికోలో ఇది కనిష్ట స్థాయిలో 17.4 శాతం.

దేశ జీడీపీలో కుటుంబాల రుణ నిష్పత్తి తీరు..

ఆర్థిక సంవత్సరం

రుణ నిష్పత్తి (శాతాల్లో)

2017–18

30.1

2018–19

31.7

2019–20

32.5

2020–21

37.3

Published date : 06 Jul 2021 06:29PM

Photo Stories