డబ్ల్యూఈఎఫ్ పారిశ్రామిక సభ్య దేశంగా భారత్
Sakshi Education
ప్రపంచ ఆర్థిక వేదిక(డబ్ల్యూఈఎఫ్) పునఃనైపుణ్య విప్లవాత్మక కార్యక్రమంలో భారత్ వ్యవస్థాపక సభ్య దేశంగా చేరింది.
నాలుగో పారిశ్రామిక విప్లవానికి చేయూతగా 2030 నాటికి 100 కోట్ల మందికి మెరుగైన విద్య, నైపుణ్యాలను అందించడమే ఈ కార్యక్రమం ఉద్దేశం.
దక్షిణ కొరియా మంత్రితో గోయల్ భేటీ
స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న డబ్ల్యూఈఎఫ్ 50వ వార్షిక సదస్సుకు హాజరైన దక్షిణ కొరియా వాణిజ్య మంత్రి యూమైంగ్‌హితో కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ జనవరి 22న భేటీ అయ్యారు. వీరి మధ్య ద్వైపాక్షిక వాణిజ్య అంశాలు చర్చకు వచ్చాయి. భారతీయ రైల్వే రంగంలోకి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించే అంశంపైనా చర్చ నిర్వహించారు. పలు కంపెనీల సీఈవోలూ సమావేశమయ్యారు.
ఐటీ గవర్నర్ల కమ్యూనిటీ చైర్మన్‌గా విజయ్‌కుమార్
డబ్ల్యూఈఎఫ్ ఐటీ గవర్నర్ల కమ్యూనిటీకి చైర్మన్‌గా హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ సీఈవో సీ విజయ్‌కుమార్ పనిచేయనున్నారు. ఈ విషయాన్ని డబ్ల్యూఈఎఫ్ ప్రకటించింది.

Published date : 23 Jan 2020 05:44PM