డాలస్‌లో సమావేశంలో సీఎం జగన్
Sakshi Education
అమెరికాలోని డాలస్‌లోగల హచిన్‌సన్ కన్వెన్షన్ సెంటర్‌లో ఆగస్టు 18న నిర్వహించిన సమావేశంలో ప్రవాసాంధ్రులను ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగించారు.
ప్రవాసాంధ్రులు మన (ఆంధ్రప్రదేశ్) రాష్ట్రానికి వచ్చి ఆయా రంగాల్లో విరివిగా పెట్టుబడులు పెట్టాలని, అందుకు అన్ని విధాలా తమ ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుందని ఈ సందర్భంగా జగన్ చెప్పారు. ప్రవాసాంధ్రులు తమ గ్రామాల్లోని ఆసుపత్రులు, స్కూళ్ల పునర్నిర్మాణంలో, బస్టాపుల ఏర్పాటులో భాగస్వాములు కావాలన్నారు.
భారత రాయబారి విందులో సీఎం జగన్
అమెరికా పర్యటనలో ఉన్న సీఎం వైఎస్ జగన్ అమెరికాలో భారత రాయబారి హర్షవర్థన్ శ్రీంగ్లా వాషింగ్టన్ డీసీలో ఆగస్టు 17న ఇచ్చిన విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 60 మందికిపైగా సీనియర్ అధికారులు, వ్యాపార, వాణిజ్యవేత్తలను ఉద్దేశించి సీఎం జగన్ ప్రసంగించారు. పెట్టుబడిదారులకు అవసరమైన అన్ని అంశాలను ఒకేచోట సుహృద్భావ వాతావరణంలో కల్పిస్తామని చెప్పారు.

Published date : 19 Aug 2019 05:34PM