డాక్టర్ కార్ల్ జూన్‌కు జినోమ్ వ్యాలీ అవార్డు
Sakshi Education
కేన్సర్ మహమ్మారికి వినూత్న చికిత్సను అందుబాటులోకి తెచ్చిన అమెరికా శాస్త్రవేత్త డాక్టర్ కార్ల్ హెచ్.జూన్‌కు జినోమ్ వ్యాలీ ఎక్సలెన్సీ-2020 అవార్డు అందించనున్నట్లు బయో ఆసియా నిర్వాహకులు ప్రకటించారు.
కార్ల్ జూన్‌తో పాటు ప్రజారోగ్య రంగంలో విశేష కృషి చేసిన అంతర్జాతీయ ఫార్మా కంపెనీ నోవార్టిస్ సీఈవో డాక్టర్ వాస్ నరసింహన్‌లకు కూడా ఈ అవార్డు అందించనున్నట్లు తెలిపారు. ఫార్మా రంగంతోపాటు, ప్రజారోగ్యానికి సంబంధించిన అంశాలను విసృ్తతంగా చర్చించే బయో ఆసియా ఆయా రంగాల్లో విశిష్ట కృషి చేసిన వారికి జినోమ్ వ్యాలీ ఎక్సలెన్సీ అవార్డులు అందిస్తోంది.
తెలంగాణ ప్రభుత్వం ఏటా నిర్వహించే బయో ఆసియా ఇప్పటికే ఆసియా మొత్తానికి అతిపెద్ద జీవశాస్త్ర సంబంధిత వేదికగా పరిణమించిన సంగతి తెలిసిందే. 2020 ఏడాది బయో ఆసియా సమావేశం ఫిబ్రవరి 17 నుంచి మూడు రోజులపాటు జరగనుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : జినోమ్ వ్యాలీ ఎక్సలెన్సీ-2020 అవార్డు విజేతలు
ఎప్పుడు : ఫిబ్రవరి 13
ఎవరు : డాక్టర్ కార్ల్ హెచ్.జూన్, డాక్టర్ వాస్ నరసింహన్
ఎందుకు : వైద్య రంగంలో విశేషకృషి చేసినందుకు

Published date : 14 Feb 2020 05:51PM