Skip to main content

డాక్టర్ హేమలతకు ఛేంజ్ మేకర్ అవార్డు

జాతీయ పోషకాహార సంస్థ డెరైక్టర్ డాక్టర్ హేమలత ఛేంజ్ మేకర్ అవార్డును దక్కించుకున్నారు.
సేవ్ ది చిల్డ్రన్ అనే స్వచ్ఛంద సంస్థ ప్రకటించిన ఈ అవార్డును తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ చేతుల మీదుగా హేమలత అందుకున్నారు. సేవ్ ది చిల్డ్రన్ ఏర్పాటై వందేళ్లు పూర్తయిన సందర్భంగా సెప్టెంబర్ 4న హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ అవార్డును ప్రదానం చేశారు. శిశు పోషణ విషయంలో విశేషకృషి చేసినందుకు గుర్తింపుగా హేమలతకు ఈ అవార్డు దక్కింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
సేవ్ ది చిల్డ్రన్ సంస్థ అందించే ఛేంజ్ మేకర్ అవార్డు
ఎప్పుడు : సెప్టెంబర్ 4
ఎవరు : జాతీయ పోషకాహార సంస్థ డెరైక్టర్ డాక్టర్ హేమలత
ఎందుకు : శిశు పోషణ విషయంలో విశేషకృషి చేసినందుకు గుర్తింపుగా
Published date : 05 Sep 2019 05:57PM

Photo Stories