ద. కొరియా, జపాన్ వీసా నిలిపివేత: భారత్
Sakshi Education
కోవిడ్ 19(కరోనా వైరస్) బారిన పడిన దేశాల సంఖ్య పెరిగిపోతూ ఉండడంతో భారత్ అప్రమత్తమైంది.
దక్షిణ కొరియా, జపాన్ దేశాల నుంచి వచ్చే వారి వీసాలను ఫిబ్రవరి 28 నుంచి తాత్కాలికంగా నిలిపివేసింది. దక్షిణ కొరియాలో ఇప్పటివరకు 13 మంది ఈ వ్యాధితో మరణిస్తే, కేసులు 2 వేలు దాటిపోయాయి. జపాన్ షిప్‌లో ఉన్న ప్రయాణికుల్లో కూడా చాలా మందికి కరోనా వైరస్ సోకింది. ఇప్పటివరకు 57 దేశాలకు ఈ వ్యాధి వ్యాపించింది. ఇటలీ, ఇరాన్‌లో కూడా కేసులు భారీగా పెరిగాయి.
జెనీవా ఆటో షో రద్దు
కోవిడ్-19 వైరస్(కరోనా) నేపథ్యంలో ఎగ్జిబిషన్ల వంటి కార్యక్రమాలను నిషేధించినట్లు స్విస్ ప్రభుత్వం ఫిబ్రవరి 28న నిషేధాన్ని ప్రకటించింది. ఈ వ్యాధి సోకకుండా ఉండేందుకు 1,000 మందికి మించిన జనసమూహాలు ఉండ కూడదని వెల్లడించింది. దీంతో 2020, మార్చి 5 నుంచి 15 వరకు జరగాల్సిన జెనీవా ఆటో షో రద్దు అయి్యంది. ఇప్పటికే 15 కేసులను స్విస్ ప్రభుత్వం గుర్తించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : దక్షిణ కొరియా, జపాన్ దేశీయుల వీసా నిలిపివేత
ఎప్పుడు : ఫిబ్రవరి 28
ఎవరు : భారత్
ఎందుకు : కోవిడ్-19 విజృంభణ నేపథ్యంలో

Published date : 29 Feb 2020 05:43PM