Daily Current Affairs in Telugu: 2022, సెప్టెంబర్ 21st కరెంట్ అఫైర్స్
Indians Savings: బ్యాంకుల్లో జనం దాచుకుంది.. కోటీ 35 లక్షల కోట్లు
మన దేశంలో ప్రజలు బ్యాంకుల్లో వివిధ రూపాల్లో దాచుకున్న సొమ్ము రూ.1,35,59,212 కోట్లు.. అక్షరాల్లో చెప్పాలంటే.. కోటీ 35 లక్షల కోట్ల పైచిలుకే. దీనిని మన దేశ జనాభాతో సగటున లెక్కిస్తే ఒక్కొక్కరి సొమ్ము సుమారు లక్ష రూపాయలు అని చెప్పొచ్చు. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ లెక్కలను వెల్లడించింది. ఇండియన్ ఎకానమీ స్టాటిస్టిక్స్ (2021–22) పేరిట రిజర్వు బ్యాంకు ఈ నివేదికను విడుదల చేసింది. అందులో 1983వ సంవత్సరం నుంచీ 2021–22 వరకు బ్యాంకుల్లో భారతీయులు డిపాజిట్ చేసిన సొమ్ము లెక్కలను వెల్లడించింది.
Also read: Ants: మేం ఎంత మంది ఉన్నామో చూశారా..
సేవింగ్స్ భారీగా పెరుగుతూ..
1983–84 ఆర్థిక సంవత్సరంలో భారతీయులు దాచుకున్న సేవింగ్స్ డిపాజిట్ల విలువ రూ.17,811 కోట్లు. ఇందులో భారతీయ బ్యాంకుల్లో రూ.17,430 కోట్లు ఉండగా.. విదేశీ బ్యాంకుల్లో రూ.381 కోట్లు దాచుకున్నారు. పదేళ్ల తర్వాత అంటే 1993–94లో సేవింగ్స్ డిపాజిట్లలో సొమ్ము రూ.71,151 కోట్లకు చేరింది. విదేశీ బ్యాంకుల్లో చేసిన డిపాజిట్లు రూ.1,718 కోట్లుగా ఉన్నాయి. మరో పదేళ్ల తర్వాత అంటే.. 2003–04 నాటికి బ్యాంకుల్లో డిపాజిట్లు రూ.3.85 లక్షల కోట్లు దాటాయి. విదేశీ బ్యాంకుల్లో భారతీయులు చేసిన డిపాజిట్లు రూ.12,232 కోట్లకు చేరాయి. ఇక 2013–14 నాటికి సేవింగ్స్ రూ.20 లక్షల కోట్లు దాటాయి. ఇందులో భారతీయ బ్యాంకుల్లో రూ.19.6 లక్షల కోట్లకుపైగా ఉండగా.. విదేశీ బ్యాంకుల్లో రూ.40,390 కోట్లకు చేరాయి.
2014 నుంచి సేవింగ్స్ డిపాజిట్ల తీరు.. (రూ.కోట్లలో)
ఏడాది | భారత బ్యాంకుల్లో | విదేశీ బ్యాంకుల్లో | మొత్తం | ||
2014–15 | 21,78,847 | 41,046 | 22,19,893 | ||
2015–16 | 24,92,846 | 43,698 | 25,36,544 | ||
2016–17 | 33,40,707 | 52,876 | 33,93,583 | ||
2017–18 | 35,99,341 | 55,896 | 36,55,237 | ||
2018–19 | 39,72,547 | 58,630 | 40,31,177 | ||
2019–20 | 42,85,362 | 65,384 | 43,50,746 | ||
2020–21 | 49,74,715 | 81,092 | 50,55,807 | ||
2021–22 | 55,94,034 | 87,284 | 56,81,318 |
2014 నుంచి వివిధ టర్మ్ డిపాజిట్ల తీరు.. (రూ.కోట్లలో)
ఏడాది | 90 రోజుల్లోపు | 6 నెలలు–ఏడాది | 5 ఏళ్లపైన |
2014 | 3,64,909 | 7,34,703 | 7,73,620 |
2015 | 4,27,722 | 7,19,993 | 7,91,137 |
2016 | 4,35,318 | 5,55,536 | 8,47,659 |
2017 | 4,47,000 | 8,40,158 | 9,45,980 |
2018 | 4,25,420 | 8,05,586 | 10,00,865 |
2019 | 5,16,651 | 6,19,998 | 9,25,059 |
2020 | 10,84,623 | 4,58,797 | 9,93,286 |
2021 | 13,02,760 | 7,96,325 | 7,47,654 |
(ఆరు నెలల లోపు, ఏడాది నుంచి రెండేళ్ల మధ్య, రెండేళ్ల నుంచి మూడేళ్ల మధ్య, మూడేళ్ల నుంచి ఐదేళ్ల మధ్య.. ఇలా అన్నిరకాల టర్మ్ డిపాజిట్లు కలిపి 2021–22 ఆర్థిక సంవత్సరం నాటికి షెడ్యూల్డ్ బ్యాంకుల్లో ఉన్న సొమ్ము రూ.78,77,894 కోట్లు అని రిజర్వుబ్యాంకు నివేదికలో పేర్కొంది)
Also read: Weekly Current Affairs (Important Dates) Bitbank: జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు?
అయితే తక్కువ.. లేకుంటే సుదీర్ఘంగా..
- టర్మ్ (ఫిక్స్‌డ్) డిపాజిట్ల విషయానికి వస్తే భారతీయులు ఎక్కువగా అయితే 90 రోజుల్లోపు లేదా ఐదేళ్ల కన్నా ఎక్కువకాలం ఉండే టర్మ్ డిపాజిట్ల వైపే మొగ్గు చూపుతున్నారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
- 1998లో 90 రోజుల్లోపు టర్మ్ డిపాజిట్ల విలువ రూ.41,365 కోట్లుకాగా.. 2008 నాటికి 1.51 లక్షల కోట్లకు, 2018నాటికి 4.25 లక్షల కోట్ల కు, 2021–22 నాటికి 13,02,760 కోట్లకు చేరాయి.
- ఇక ఐదేళ్లకన్నా ఎక్కువ కాల వ్యవధి ఉన్న టర్మ్ డిపాజిట్లు 1998లో రూ. 46,231 కోట్లు ఉంటే, 2008 నాటికి రూ.1.65 లక్షల కోట్లకు, 2018 నాటికి రూ.10 లక్షల కోట్లకు చేరాయి. అయితే 2021 నాటికి ఇవి రూ.7.47 లక్షల కోట్లకు తగ్గాయి.
Also read: Daily Current Affairs in Telugu: 2022, సెప్టెంబర్ 20th కరెంట్ అఫైర్స్
NGOs: 4 సెకన్లకో ఆకలి చావు
ప్రపంచవ్యాప్తంగా 45 దేశాల్లోని 34.5 కోట్ల మంది ప్రజలు తీవ్ర క్షుద్బాధతో తనువు చాలిస్తున్నారని నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్(ఎన్‌జీవోలు) పేర్కొన్నాయి. రోజుకు 19,700 మంది వంతున ప్రతి సెకనుకు నలుగురు చొప్పున ఆకలితో చనిపోతున్నట్లు అందులో పేర్కొన్నాయి. 2019తో పోలిస్తే ఆకలి చావులు రెట్టింపయ్యాయని తెలిపాయి.
75 దేశాలకు చెందిన ఆక్స్‌ఫామ్, సేవ్ ది చిల్డ్రన్, ప్లాన్ ఇంటర్నేషనల్ వంటి 238 ఎన్‌జీవోలు ఈ మేరకు ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ సమావేశాలకు హాజరయ్యే ప్రపంచ దేశాల నేతల నుద్దేశించి లేఖ రాశాయి. ‘‘21వ శతాబ్దంలో కరువు పరిస్థితులను రానివ్వబోమంటూ ప్రపంచ నేతలు ప్రతినబూనినప్పటికీ సొమాలియాలో మరోసారి తీవ్ర కరువు తాండవిస్తోంది.
Also read: Weekly Current Affairs (Important Dates) Bitbank: జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు?
Lumpy skin disease (LSD): వణికిస్తున్న లంపీ ముప్పు.. పాడి పశువుల్లో వ్యాపిస్తున్న వ్యాధి
దేశంలో కొద్ది నెలలుగా మరో వైరస్ పేరు మారుమోగుతోంది. పాడి పశువుల్లో ఈ వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. అదే లంపీ స్కిన్ వ్యాధి (ఎల్‌ఎస్‌డీ). కాప్రిపాక్స్ అని పిలిచే ఈ వైరస్ ఆవులు, గేదెలకు సోకుతోంది. ఈ ఏప్రిల్‌లో గుజరాత్‌లోని కచ్‌లో తొలిసారి ఇది బయటపడింది. రాజస్తాన్, మహారాష్ట్ర, పంజాబ్, హరియాణా, యూపీ సహా పలు రాష్ట్రాలకు విస్తరించింది. దేశవ్యాప్తంగా ఇప్పటికే 70 వేల పశువులు మరణించాయి. మరో 15 లక్షల పశువులకు వైరస్ సోకింది. ఈ అంటువ్యాధి మరింత విస్తరిస్తే దేశ పాడిపరిశ్రమకే తీవ్ర నష్టం తప్పదన్న ఆందోళనలున్నాయి.
Also read: COVID-19: వాయిస్ విని వైరస్ గుట్టు చెప్పేస్తుంది
ఏమిటీ వైరస్?
దోమలు, ఈగలు, పేలు మరికొన్ని కీటకాల ద్వారా ఈ వ్యాధి సంక్రమిస్తుంది. ఇది గోటోపాక్స్, షీప్ పాక్స్ కుటుంబానికి చెందిన వైరస్. ఈ వ్యాధితో పశువులకు జ్వరం సోకడంతో పాటు వాటి చర్మంపై గడ్డలు ఏర్పడతాయి. ఈ వైరస్ సోకితే పశువులు ఆహారం తీసుకోలేవు. అధికంగా లాలాజలం ఊరి నోట్లో నుంచి బయటకు వస్తుంది. ముక్కు, కళ్లల్లోంచి కూడా స్రవాలు బయటకి వస్తాయి. కొన్నాళ్లకే పశువులు బరువును కోల్పోవడం, పాల దిగుబడి తగ్గిపోవడం జరుగుతోంది.ఈ వైరస్‌కు ఎలాంటి చికిత్స లేకపోవడంతో ఎన్నో పశువులు మృత్యువాత పడుతున్నాయి. పశువుల్లో ప్రాణాంతకంగా మారిన ఈ వైరస్ సోకిన జంతువులకు పశు వైద్యులు ప్రస్తుతానికి యాంటీబయోటిక్స్ ఇస్తూ ఉపశమనం కలిగిస్తున్నారు.
Also read: Covid vaccine: ముక్కు ద్వారా తీసుకునే కోవిడ్ వ్యాక్సిన్‌కు DCGI అనుమతి
మనుషులకు సోకదు
లంపీ స్కిన్ వ్యాధి మనుషులకి సోకే అవకాశం ఎంత మాత్రం లేదదిది జూనోటిక్ (మనుషులకు సంక్రమించదు) వైరస్ కాదని, మనుషులకు సోకదని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్‌ఐవీ) నిపుణులు వెల్లడించారు. వ్యాధి సోకిన ఆవుల పాలను నిర్భయంగా తాగవచ్చునని మనుషులకు ఎలాంటి ముప్పు లేదని చెబుతున్నారు.
Also read: MCED blood test: క్యాన్సర్ నిర్ధారణ పరీక్షల్లో... గేమ్ చేంజర్
పరిష్కారమేంటి?
ప్రస్తుతానికి ఈ వ్యాధి మరింత విస్తరించకుండా రాష్ట్రాల పశుసంవర్ధక శాఖలు బాధ్యత తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. రైతులు, పశుపోషకుల్లో ఈ వ్యాధిపై అవగాహన పెరిగేలా విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహించాలని, కేంద్రం రాష్ట్రాల పశుసంవర్ధక శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. ఇరుగు పొరుగు రాష్ట్రాలకు కొన్నాళ్లు పాటు పశువుల్ని వేరే రాష్ట్రాలకు తరలించవద్దని సూచించింది. గోట్‌పాక్స్ వైరస్ నిరోధక వ్యాక్సిన్ దీనినీ అరికడుతుందని నిపుణులు చెప్పడంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1.5 కోట్లను ఈ వైరస్ ఉన్న ప్రాంతాలకు పంపిణీ చేశారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ (ఐసీఏఆర్), ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఐబీఆర్‌ఐ) సంయుక్తంగా లంపీ స్కిన్ వ్యాధికి వ్యాక్సిన్ కనుగొన్నారు. అయితే ఇది అందుబాటులోకి రావడానికి మరో మూడు నాలుగు నెలలు పడుతుంది. దేశంలోని పశువులన్నింటికీ వ్యాక్సిన్ ఇవ్వాలంటే 18–20 టీకా డోసులు అవసరం. దేశంలోని పశువులకి 80శాతం వ్యాక్సినేషన్ పూర్తి అయితేనే ఈ వ్యాధి ముప్పు నుంచి బయటపడతామని ఏనిమల్ సైన్సెస్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ బి.ఎన్. త్రిపాఠి అభిప్రాయపడ్డారు. 2025 నాటికి వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి అవుతుందని కేంద్రం అంచనా వేస్తోంది.
– సాక్షి, నేషనల్ డెస్క్
Also read: Human Genome Sequence: మనిషిలో సుమారు ఎన్ని వేల జీన్స్ ఉంటాయి?
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP