Skip to main content

Daily Current Affairs in Telugu: 2022, జులై 7th కరెంట్‌ అఫైర్స్‌

Current Affairs in Telugu July 7th 2022
Current Affairs in Telugu July 7th 2022

Motor Floater Policy: ఒకటికి మించిన వాహనాలకు ఒకే బీమా ప్లాన్‌ 
ఒక వ్యక్తికి కారు, బైకు ఉన్నా.. రెండింటికీ కలిపి ఒకే వాహన బీమా తీసుకునేలా వీలు కల్పిస్తూ.. మోటారు ఇన్సూరెన్స్‌ పాలసీలకు అధునాతన ఫీచర్లతో కూడిన యాడాన్‌లను ప్రవేశపెట్టేందుకు బీమా రంగ నియంత్రణ సంస్థ (ఐఆర్‌డీఏఐ) అనుమతించింది. 
కొత్త యాడాన్‌లు..: మోటారు ఓన్‌ డ్యామేజ్‌ (ఓడీ) అన్నది బేసిక్‌ మోటారు బీమా ప్లాన్‌. ఇందులో వాహనానికి ఏదైనా కారణం వల్ల నష్టం ఏర్పడితే కవరేజీ ఉంటుంది. ఇప్పుడు దీనికి ‘పే యాజ్‌ యూ డ్రైవ్, పే హౌ యూ డ్రైవ్‌’ అనే కాన్సెప్ట్‌ తోడు కానుంది. వాహనాన్ని నడిపిన మేరకు, నడిపే తీరుకు అనుగుణంగా బీమా సంస్థ టెక్నాలజీ సాయంతో ప్రీమియాన్ని నిర్ణయిస్తుంది.

Also read: GK Economy Quiz: US డాలర్‌తో పోలిస్తే భారతీయ రూపాయి ఆల్ టైమ్ కనిష్ట రికార్డు ఎంత?

దాహరణకు తక్కువ దూరం నడిపేవారికి తక్కువ ప్రీమియం, ఎక్కువ దూరం నడిపేవారికి కొంచెం ఎక్కువ ప్రీమియం ఇలా అన్నమాట. లేదంటే తక్కువ దూరం, సురక్షిత డ్రైవింగ్‌ విధానాన్ని అనుసరించే వారికి తక్కువ ప్రీమియానికే మరింత కవరేజీ లభించొచ్చు. అలాగే, ఒకే వాహనదారుడికి ఒకటికి మించిన వాహనాలు ఉంటే అన్నింటికీ కలిపి ఫ్లోటర్‌ పాలసీ జారీ చేసేందుకు కూడా ఐఆర్‌డీఏఐ అనుమతించింది. 

భారత్‌లో Google Startup School 

అంకుర సంస్థలు ప్రారంభ దశలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించి, నిలదొక్కుకునేందుకు తోడ్పాటు అందించే దిశగా టెక్‌ దిగ్గజం గూగుల్‌.. భారత్‌లో స్టార్టప్‌ స్కూల్‌ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీని ద్వారా ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో దాదాపు 10,000 స్టార్టప్‌లకు సహాయం అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రోగ్రాం వర్చువల్‌గా తొమ్మిది వారాల పాటు ఉంటుంది. మెరుగైన ఉత్పత్తిని సమర్థంగా రూపొందించేందుకు వ్యూహాలు, కొత్తగా ఇంటర్నెట్‌కు పరిచయమయ్యే యూజర్ల కోసం యాప్‌ల రూపకల్పన, కొత్త యూజర్లను దక్కించుకునేందుకు పాటించాల్సిన వ్యూహాలు మొదలైన వాటిలో ఇందులో శిక్షణ పొందవచ్చు. అలాగే స్టార్టప్‌ వ్యవస్థకు సంబంధించిన పలువురు దిగ్గజాలతో చర్చా కార్యక్రమాలు మొదలైనవి కూడా ఉంటాయి. 

Also read: GK Sports Quiz: 4వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఏ రాష్ట్రంలో జరగనున్నాయి?

దాదాపు 70,000 పైచిలుకు అంకుర సంస్థలతో స్టార్టప్‌ల విషయంలో భారత్‌ ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉంది. హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ వంటి పెద్ద నగరాల నుంచే కాకుండా చిన్న పట్టణాల నుంచి కూడా అనేకానేక స్టార్టప్‌లు వస్తున్నాయి. అయితే, 90 శాతం స్టార్టప్‌లు తొలి అయిదేళ్లలోనే మూతబడుతున్నాయి. ఖర్చులపై అదుపు లేకపోవడం, డిమాండ్‌ను సరిగ్గా అంచనా వేసుకోలేకపోవడం, సారథ్యం సరిగ్గా లేకపోవడం వంటి అంశాలు ఇందుకు కారణంగా ఉంటున్నాయని గూగుల్‌ ఒక బ్లాగ్‌పోస్ట్‌లో వివరించింది. ఇలాంటి సవాళ్లను అధిగమించి అంకుర సంస్థలు నిలదొక్కుకోవడంలో సహకరించే లక్ష్యంతోనే స్టార్టప్‌ స్కూల్‌ను తలపెట్టినట్లు పేర్కొంది.


Face Recognition:ఇండియన్ రైల్వేలో విధ్వంసాన్ని పసిగట్టే వీడియో వ్యవస్థ

ఇటీవల జరిగిన ‘అగ్నిపథ్‌’ ఆందోళ నలు, రైళ్ల దహనం నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రధాన రైల్వేస్టేషన్లలో అధునాతన సీసీటీవీ భద్రతా వ్యవస్థను రైల్వే శాఖ అందుబాటులోకి తీసుకు రానుంది. ఇప్పటివరకు ఉన్న సాధారణ సీసీ కెమెరాల స్థానంలో హైటెక్‌ కెమెరా లతో కూడిన వీడియో నిఘా వ్యవస్థ–వీఎస్‌ఎస్‌ (సీసీటీవీ కెమెరాల నెట్‌వర్క్‌)ను ఏర్పాటు చేయనుంది. కృత్రిమ మేథ (ఏఐ) సాయంతో పనిచేసే వీడియో విశ్లేషణ సాఫ్ట్‌వేర్‌తోపాటు స్టేషన్ల ఆవరణ లోకి పాత నేరస్తులు ప్రవే శించిన వెంటనే గుర్తించి అధికారులను అప్రమత్తం చేయగల ముఖాల గుర్తింపు (ఫేషియల్‌ రికగ్నిషన్‌) సాఫ్ట్‌ వేర్‌ను వినియోగించనుంది. అలాగే రైల్వే సిబ్బంది ఏ ప్రాంతంలో ఉన్న వెబ్‌ బ్రౌజర్‌ నుంచైనా స్టేషన్లలోని సీసీ కెమె రాలు, సర్వర్, యూపీఎస్, స్విచ్‌లను వీక్షిస్తూ పర్యవేక్షించేలా నెట్‌వర్క్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ను వాడనుంది. తొలి దశలో భాగంగా దక్షిణమధ్య రైల్వే పరిధిలోని 76 స్టేషన్లు సహా దేశవ్యాప్తంగా 756 స్టేషన్లను వీడియో నిఘా వ్యవస్థ కోసం ఎంపిక చేసింది. ఇందులో తెలంగాణకు సంబంధించి 39 స్టేషన్లు ఉన్నాయి. రైల్వే అనుబంధ సంస్థ రైల్‌టెల్‌ ఆధ్వర్యంలో ఈ వ్యవస్థ ఏర్పాటు పనులు జరగను న్నాయి. మలి దశల్లో ఇతర స్టేషన్‌ లలో హైటెక్‌ సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తారు. ‘నిర్భయ నిధుల’తో చేపడుతున్న ఈ ప్రాజెక్టును 2023 జనవరి లోగా పూర్తి చేసే అవకాశం ఉందని రైల్‌టెల్‌ జూలై 6న ఓ ప్రకటనలో తెలిపింది.

also read: Army Recruitment: ఏఏ దేశాల్లో సైనిక నియామకాలు ఎలా ఉన్నాయంటే..? 

Published date : 07 Jul 2022 03:56PM

Photo Stories