Daily Current Affairs in Telugu: 2022, ఆగష్టు 24th కరెంట్ అఫైర్స్
NASA: కృష్ణబిలం ‘వినిపిస్తోంది’
కృష్ణబిలం. ఆయువు తీరిన తార తనలోకి తాను కుంచించుకుపోయే క్రమంలో ఏర్పడే అనంత గురుత్వాకర్షణ శక్తి కేంద్రం. సెకనుకు మూడు లక్షల కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే కాంతితో సహా సర్వాన్నీ శాశ్వతంగా తనలోకి లాక్కుంటుంది. దాని గుండా కాంతి కూడా ప్రసరించలేదు గనక కృష్ణబిలం (బ్లాక్‌హోల్) ఎలా ఉంటుందో మనం చూసే అవకాశం లేదు. అలాంటి కృష్ణబిలం నాసా శాస్త్రవేత్తల కృషి ఫలితంగా తొలిసారి ‘విని్పంచింది’. ఇందుకోసం 2003లో సేకరించిన ఒక కృష్ణబిలం తాలూకు డేటాకు శాస్త్రీయ పద్ధతిలో నాసా శబ్ద రూపమిచ్చింది. దాని కేంద్రం నుంచి అన్నివైపులకూ ఊహాతీతమైన వేగంతో నిత్యం వెలువడే అతి తీవ్రమైన ఒత్తిడి తరంగాలను శబ్ద రూపంలోకి మార్చి విడుదల చేసింది. శబ్దం శూన్యంలో ప్రయాణించదన్నది తెలిసిందే. అంతరిక్షం చాలావరకూ శూన్యమయం. కానీ పాలపుంతల సమూహాల్లో అపారమైన వాయువులుంటాయి. వాటిగుండా ప్రయాణించే కృష్ణబిలపు ఒత్తిడి తరంగాలకు నాసా తాలూకు చంద్ర అబ్జర్వేటరీ స్వర రూపమిచ్చింది. ఈ శబ్దం అచ్చం హారర్ సినిమాల్లో నేపథ్య సంగీతం మాదిరిగా ‘హూం’... అంటూ విని్పస్తోంది. నాసా విడుదల చేసిన వీడియోలో దీన్ని స్పష్టంగా వినవచ్చు. సైన్స్‌ను మరింత మందికి చేరువ చేసే లక్ష్యంతోనే ఈ శబ్ద సృష్టి చేసినట్టు నాసా తెలిపింది.
Also read: MIRI: అరుదైన కార్ట్‌వీల్ గెలాక్సీ
Senior Advocate: ప్రముఖ న్యాయకోవిధుడు సత్తి వెంకట్‌రెడ్డి కన్నుమూత
ప్రముఖ న్యాయ కోవిదుడు, మాజీ అడ్వొకేట్ జనరల్, సీనియర్ న్యాయవాది సత్తి వెంకట్‌రెడ్డి కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆగష్టు 23 న హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన వయస్సు 97 సంవత్సరాలు. ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నా రు. సత్తి వెంకట్‌రెడ్డి స్వస్థలం పశి్చమగోదావరి జిల్లా, కవిటం గ్రామం. అక్కడే 1926, ఫిబ్ర వరి 25న జని్మంచారు. 1951లో న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు. కొంత కాలం పాటు రాజమండ్రిలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. అటు తరువాత 1956లో హైదరాబాద్‌కు మకాం మార్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉత్తమ న్యాయవాదుల్లో ఒకరిగా పేరుగాంచారు. 1992–94 మధ్య కాలంలో కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా, సత్తి వెంకట్‌రెడ్డి అడ్వొకేట్ జనరల్‌గా సేవలు అందించారు. ఆయన పలు కీలక కేసుల్లో వాదనలు వినిపించారు.
Also read: Daily Current Affairs in Telugu: 2022, ఆగష్టు 23rd కరెంట్ అఫైర్స్
PMU: వైద్య పరికరం పాడైతే ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చు
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆగష్టు 23 న కీలక నిర్ణయం తీసుకుంది. ఎలాంటి పరికరం పాడైపోయినా ఎవరైనా సరే వెంటనే ఫిర్యాదు చేసేందుకు 8888 526666 నంబర్‌ను అందుబాటులోకి తీసుకొ చ్చింది. రాష్ట్రంలో తొలిసారిగా రూ.20 కోట్లతో ‘బయో మెడికల్ ఎక్విప్‌మెంట్ మెయింటెనెన్స్’పేరుతో వైద్య పరికరాల నిర్వహణకు విధానాన్ని వైద్య ఆరోగ్యశాఖ రూపొందించింది. ఇందులోభాగంగా వైద్య పరికరాల నిర్వహణకు ప్రత్యేకంగా ప్రోగ్రాం మానిటరింగ్ యూనిట్ (పీఎంయూ)ను తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ)లో ఏర్పాటు చేసింది. వైద్య పరికరాల వివరాలన్నీ వెబ్ పోర్టల్‌లో నమోదై ఉంటాయి. అవి ప్రస్తుతం ఏ ఆస్పత్రుల్లో ఉన్నాయి.. తయారీ తేదీ...వారంటీ తేదీ...గతంలో జరిగిన మరమ్మతుల వివరాలు, ప్రస్తుత మెయింటెనెన్స్ కాంటాక్ట్ వివరాలు అందులో ఉంటాయి. రూ.5 లక్షలకు పైగా విలువైన అన్ని రకాల వైద్య పరికరాలు ఏవైనా పాడైతే వెంటనే డాక్టర్ కానీ, రోగికానీ ఇతరులెవరైనా https://emmstelangana.uat. dcservices.in/ లేదా 8888 526666 నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చు.
Also read: Indian Navy: భారతదేశ స్వదేశీ విమాన వాహక నౌక IAC `విక్రాంత్` సెప్టెంబరు 2న నౌకాదళంలోకి ప్రవేశించనుంది
Medical Health Department: 12 జిల్లాల్లో సెంట్రల్ మెడిసిన్ స్టోర్లు
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుప త్రులకు వచ్చే రోగులకు అవసరమైన మందులు అన్నింటినీ ఉచితంగా ఇవ్వాలని వైద్య ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు చాలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్ మందులు రాశాక రోగులకు నిర్దేశిత రోజులకు అవసరమైనన్ని మందులు కాకుండా తక్కువ రోజులకు ఇస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రోగులకు అవసరమై నన్ని మందులను ఉచితంగానే ఇవ్వాలని ప్రభు త్వం నిర్ణయించింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) మొదలు ఏరియా, సామాజిక, జిల్లా, బోధనాసుపత్రుల వరకు అన్ని చోట్లా దీన్ని అమలు చేస్తారు. వైద్యులు అక్కడుండే మందులనే రాసి రోగులు బయట కొనే పరిస్థితి లేకుండా చూడాల్సి ఉంటుంది. ఇన్‌పేషెంట్లు, ఔట్ పేషెంట్లు అందరికీ నిర్ణీత కోర్సు మేరకు మందులు ఇస్తారు. ప్రభుత్వం మందుల కోసం ఈ ఏడాది బడ్జెట్లో రూ. 500 కోట్లు కేటాయించింది.
Also read: Flipkart గ్రోసరీ ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్ ప్రారంభం
12 జిల్లాల్లో సెంట్రల్ మెడిసిన్ స్టోర్స్
ప్రభుత్వ ఆసుపత్రుల్లో పూర్తిస్థాయిలో అవసరమైనన్ని మందులను అన్ని జిల్లాలకు సరఫరా చేసేలా 12 జిల్లాల్లో సెంట్రల్ మెడిసిన్ స్టోర్స్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వీటిల్లో మూడు నెలలకు సరిపడా మందులు ఎల్లప్పుడూ నిల్వ ఉంటాయి. ఎప్పటికప్పుడు మూడు నెలల బఫర్ స్టాక్‌ను నిర్వహించాలని మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) కింద రూ.43.20 కోట్ల నిధులతో 2022–23లో సిద్దిపేటలోని బోధనాసుపత్రి, వనపర్తి, మహబూబాబాద్, జగిత్యాల, మంచిర్యాల, భూపాలపల్లి జిల్లా ఆసుపత్రుల్లో ఏర్పాటు చేస్తారు. 2023–24 సంవత్సరంలో కొత్తగూడెం, నాగర్‌కర్నూలు, భువనగిరి, గద్వాల జిల్లా ఆసుపత్రుల్లో, వికారాబాద్ ఏరియా ఆసుపత్రిలో, సూర్యాపేట బోధనాసుపత్రిలో నెలకొల్పుతారు. ఒక్కో సెంట్రల్ మెడిసిన్ స్టోర్ ఏర్పాటుకు రూ.3.60 కోట్ల చొప్పున కేటాయించారు.
Also read: Weekly Current Affairs (International) Bitbank: 2022 ఎక్స్‌పాట్ ఇన్‌సైడర్ ర్యాంకింగ్స్ ప్రకారం భారతదేశం ర్యాంక్ ఎంత?
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP