Skip to main content

చతుర్భుజ కూటమి విదేశాంగ మంత్రుల సమావేశం ఏ దేశ రాజధానిలో జరగనుంది?

చైనా దూకుడుకు అడ్డుకట్ట వేసే లక్ష్యంతో ఏర్పడిన భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ దేశాల చతుర్భుజ కూటమి (క్వాడ్రిలేటరల్ కోయెలిషన్) దేశాల విదేశాంగ మంత్రులు 2020, అక్టోబర్ 6న జపాన్ రాజధాని టోక్యోలో సమావేశం కానున్నారు.
Current Affairs
భారత విదేశాంగ శాఖ మంత్రి డా. సుబ్రమణ్యం జైశంకర్ ఈ సమావేశంలో పాల్గొననున్నారు.

1959 నాటి చైనా వాదనను అంగీకరించం
1959 నాటి వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ)కు కట్టుబడి ఉంటామంటూ చైనా లేవనెత్తిన సరికొత్త వాదనను భారత్ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. ‘చైనా ఏకపక్షంగా నిర్వచించిన 1959 ఎల్‌ఏసీని భారత్ ఎన్నడూ ఆమోదించలేదు. ఈ విషయం చైనా సహా అందరికీ తెలుసు’ అని విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ సెప్టెంబర్ 29న తెలిపారు. 1959లో అప్పటి చైనా ప్రధాని చౌఎన్‌లై, భారత ప్రధాని నెహ్రూకు రాసిన లేఖలో పేర్కొన్న ఎల్‌ఏసీని తాము గుర్తిస్తామంటూ చైనా విదేశాంగ శాఖ తెలపడంపై శ్రీవాస్తవ ఈ మేరకు స్పందించారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : 2020, అక్టోబర్ 6న చతుర్భుజ కూటమి విదేశాంగ మంత్రుల సమావేశం
ఎప్పుడు : సెప్టెంబర్ 29
ఎక్కడ : టోక్యో, ఆంధ్రప్రదేశ్
ఎందుకు : పలు విషయాల్లో చైనా దూకుడుకు అడ్డుకట్ట వేసే లక్ష్యంతో
Published date : 01 Oct 2020 12:29PM

Photo Stories