Skip to main content

చర్లపల్లి రైల్వే టెర్మినల్ విస్తరణకు శంకుస్థాపన

తెలుగు రాష్ట్రాల్లో పలు అభివృద్ధి పనులను కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ రిమోట్ కంట్రోల్ లింక్ ద్వారా ఫిబ్రవరి 18న ప్రారంభించారు.
Current Affairsసికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో చర్లపల్లి రైల్వే టెర్మినల్ విస్తరణ ప్రాజెక్టుకు, ఎర్రగుంట్ల-నంద్యాల సెక్షన్‌లో విద్యుదీకరణకు శంకుస్థాపన చేశారు. అలాగే గుంతకల్లు-కల్లూరు మధ్య పూర్తయిన రెండో లైన్ మార్గం, విద్యుదీకరణను జాతికి అంకితం చేశారు.

రూ.221 కోట్ల అంచనాలతో...
రూ.221 కోట్ల అంచనాలతో చేపట్టిన చర్లపల్లి టెర్మినల్ విస్తరణ వల్ల నిత్యం లక్ష మందికి రవాణా సదుపాయం లభించనుంది. వచ్చే రెండేళ్లలో దీన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎర్రగుంట్ల-నంద్యాల సెక్షన్‌లో రూ.112 కోట్ల అంచనాలతో 123 కి.మీ. మేర విద్యుదీకరణ చేపట్టనున్నారు. గుంతకల్లు-కల్లూరు సెక్షన్‌లో రూ.322 కోట్ల అంచనాలతో చేపట్టిన 41 కిలోమీటర్ల రెండవ లైన్ మార్గం నిర్మాణం పూర్తయింది. విద్యుదీకరణ పనులను పూర్తి చేశారు. ఈ మార్గాన్ని మంత్రి జాతికి అంకితం చేశారు.

427 స్టేషన్లలో ఉచిత హై స్పీడ్ వైఫై
దక్షిణమధ్య రైల్వేలో ఉచిత హైస్పీడ్ వైఫై సదుపాయాన్ని మొట్టమొదట 2016లో సికింద్రాబాద్ స్టేషన్‌లో ప్రారంభించారు. ఇప్పుడు ఈ స్టేషన్ వైఫై వినియోగంలో దేశంలోనే 4వ స్థానంలో ఉంది. రూ.65 కోట్లతో 427 స్టేషన్‌లలో ఉచిత హైస్పీడ్ వైఫై సౌకర్యాన్ని కొత్తగా ప్రారంభించారు. దీన్ని మంత్రి గోయల్ జాతికి అంకితం చేశారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
చర్లపల్లి రైల్వే టెర్మినల్ విస్తరణకు శంకుస్థాపన
ఎప్పుడు : ఫిబ్రవరి 18
ఎవరు : కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్
ఎక్కడ : సికింద్రాబాద్ రైల్వేస్టేషన్
Published date : 19 Feb 2020 06:06PM

Photo Stories