చంద్రయాన్-2 కక్ష్య ఐదోసారి పెంపు
Sakshi Education
చంద్రయాన్-2 మిషన్‌కు ఆగస్టు 6న ఐదో(చివరిది) విడత కక్ష్య దూరాన్ని పెంచే ఆపరేషన్‌ను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) విజయవంతంగా పూర్తి చేసింది.
బెంగళూరు సమీపంలోని బైలాలు భూనియంత్రిత కేంద్రం నుంచి ఇస్రో శాస్త్రవేత్తలు ఈ ఆపరేషన్‌ను చేపట్టారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా షార్ కేంద్రం నుంచి జూలై 22న జీఎస్‌ఎల్‌వీ మార్క్3-ఎం1 రాకెట్ ద్వారా చంద్రయాన్ -2ను ప్రయోగించారు.
భూస్థిర కక్ష్యలో తిరుగుతున్న చంద్రయాన్-2 కక్ష్యను ఆగస్టు 6న మధ్యహ్నం 3.04 నిమిషాలకు 17 నిమిషాలపాటు ఇంజన్లను మండించి, ఐదోసారి కక్ష్య పెంపును ఇస్రో చేపట్టింది. 276 X142975 కి.మీ పరిధి కక్ష్యలో చంద్రయాన్-2ను విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఆగస్టు 14న చంద్రుడు పరిభ్రమిస్తున్న కక్ష్యలోకి చంద్రయాన్-2 ప్రవేశించి, ఆ తర్వాత చంద్రుడి స్థిర కక్ష్యలోకి ఆగస్టు 20 నాటికి చేరుతుంది. అనంతరం సెప్టెంబరు 7న చంద్రుడి ఉపరితలంపై ల్యాండర్ విక్రమ్ దిగుతుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : చంద్రయాన్-2 కక్ష్య ఐదోసారి పెంపు
ఎప్పుడు : ఆగస్టు 6
ఎవరు : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)

Published date : 07 Aug 2019 05:41PM