చమురు ఉత్పత్తి కోతకు ఒపెక్ దేశాలు అంగీకారం
Sakshi Education
రోజుకు 10 మిలియన్ బ్యారెళ్ల మేర (బీపీడీ) చమురు ఉత్పత్తిని తగ్గించేందుకు ఒపెక్, భాగస్వామ్య దేశాలు అంగీకారం తెలిపాయి.
ఈ విషయాన్ని పెట్రోలియం ఎగుమతి దేశాల సమాఖ్య ఒపెక్ ఏప్రిల్ 10న వెల్లడించింది. డిమాండ్ పడిపోయిన నేపథ్యంలో క్రూడాయిల్ ధరలు మరింత పతనమై, తమ ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలకుండా ముడిచమురు ఉత్పత్తి దేశాలు తాజా నిర్ణయం తీసుకున్నాయని... ఇందుకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకున్నాయని పేర్కొంది. ఈ ఒప్పందం ప్రకారం.. 2020, జులై వరకు రోజుకు 10 మిలియన్ బ్యారెళ్లు, ఆ తర్వాత నుంచి ఏడాది చివరి వరకు రోజుకు 8 మిలియన్ బ్యారెళ్లు, 2021 ప్రారంభం నుంచి 16 నెలల వరకు రోజుకు 6 మిలియన్ బ్యారెళ్లు చొప్పున ఉత్పత్తిని తగ్గించుకోవాల్సి ఉంటుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : రోజుకు 10 మిలియన్ బ్యారెళ్ల (బీపీడీ) చమురు ఉత్పత్తిని తగ్గించేందుకు అంగీకారం
ఎప్పుడు : ఏప్రిల్ 10
ఎవరు : ఒపెక్, భాగస్వామ్య దేశాలు
ఎందుకు : చమురు ఉత్పత్తుల డిమాండ్ పడిపోయిన నేపథ్యంలోక్విక్ రివ్యూ :
ఏమిటి : రోజుకు 10 మిలియన్ బ్యారెళ్ల (బీపీడీ) చమురు ఉత్పత్తిని తగ్గించేందుకు అంగీకారం
ఎప్పుడు : ఏప్రిల్ 10
ఎవరు : ఒపెక్, భాగస్వామ్య దేశాలు
Published date : 11 Apr 2020 06:05PM