Skip to main content

చెరకు సేకరణ ధర రూ.10 పెంపు

చక్కెర మిల్లులు రైతులకు చెల్లించే చెరకు సేకరణ ధరను క్వింటాలుకు పది రూపాయలు పెంచాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది.
Current Affairs
2020–21 (అక్టోబర్‌– సెప్టెంబర్‌) మార్కెటింగ్‌ సంవత్సరానికి చెరకు సేకరణ ధరను పది రూపాయలు పెంచి క్వింటాలుకు రూ.285గా ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ నిర్ణయించిందనికేంద్ర సమాచార శాఖ మంత్రి జవదేకర్‌ ఆగస్టు 19న తెలిపారు.

చదవండి: 2020-21 ఏడాదికి పంటల కనీస మద్ధతు ధరల జాబితా


డిస్కంలకు వెసులుబాటు

గత ఏడాది ఆదాయంలో 25 శాతానికి మించి డిస్కంలకు అప్పులు ఇవ్వకూడదనే నిబంధనను కేంద్రం సవరించింది. ఉదయ్‌ కింద 90 వేల కోట్ల రూపాయలను డిస్కంలకు రుణాలుగా అందించాలని కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. కరోనా లాక్‌డౌన్ మూలంగా వినియోగం తగ్గి, మరోవైపు బిల్లులు వసూలు కాక డిస్కంలు సమస్యలు ఎదుర్కొంటున్నాయి. అందువల్ల వర్కింగ్‌ క్యాపిటల్‌ కింద ఆదాయంలో 25 శాతానికి మించి రుణాలు ఇవ్వకూడదనే నిబంధనను ఈ ఒక్కసారికి సడలిస్తున్నాం అని జవదేకర్‌ తెలిపారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి : చక్కెర మిల్లులు రైతులకు చెల్లించే చెరకు సేకరణ ధరను క్వింటాలుకు పది రూపాయలు పెంపు
ఎప్పుడు : ఆగస్టు 19
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
Published date : 21 Aug 2020 12:28PM

Photo Stories