Skip to main content

చెంగ్డూ క్రీడల్లో తులసీ చైతన్యకు ఆరు పతకాలు

చైనాలోని చెంగ్డూలో ఆగస్టు 18న జరిగిన ప్రపంచ పోలీసు క్రీడల్లో విజయవాడ స్విమ్మర్ తులసీ చైతన్యకు ఒకస్వర్ణం, రెండు రజతాలు, మూడు కాంస్యాలతో కలిపి మొత్తం ఆరు పతకాలు లభించాయి.
విజయవాడలో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహించే తులసీ ట్రయాథ్లాన్ టీమ్ ఈవెంట్‌లో పసిడి పతకం గెలుచుకున్నాడు. 4x50 మిక్స్‌డ్ ఫ్రీస్టయిల్ రిలేలో, 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌ల్రో రజత పతకాలు సాధించాడు. 1500 మీటర్ల ఫ్రీస్టయిల్, 50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్, 4x50 మీటర్ల ఫ్రీస్టయిల్ రిలేలో కాంస్య పతకాలను సొంతం చేసుకున్నాడు. ఓవరాల్‌గా ఇప్పటివరకు తులసీ చైతన్య మూడుసార్లు (2013, 2017, 2019) ప్రపంచ పోలీసు క్రీడల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించి 20 పతకాలు సాధించాడు.

క్విక్ రివ్యూ :
ఏమిటి : పోలీసు క్రీడల్లో భారత్‌కు ఆరు పతకాలు
ఎప్పుడు : ఆగస్టు 18
ఎవరు : తులసీ చైతన్య
ఎక్కడ : చెంగ్డూ, చైనా
Published date : 19 Aug 2019 05:32PM

Photo Stories