Skip to main content

చెక్‌ బౌన్స్‌ కేసుల పరిష్కార కమిటీకి నేతృత్వం వహించనున్న న్యాయమూర్తి?

దేశ వ్యాప్తంగా కోర్టుల్లో పేరుకుపోతున్న చెక్‌బౌన్స్‌ కేసుల సత్వర పరిష్కారంపై దృష్టి సారించిన సుప్రీంకోర్టు... ఈ దిశలో మార్చి 10న కీలక చర్య తీసుకుంది.
Current Affairs ఇందుకు సంబంధించి తగిన సిఫారసులు చేయడానికి ఒక ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. ఈ కమిటీకి బాంబే హైకోర్ట్‌ మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ సి చవాన్‌ నేతృత్వం వహిస్తారు. మూడు నెలల్లో కమిటీ తన సిఫారసులను సమర్పించాల్సి ఉంటుంది.

భారీగా పేరుకుపోయిన నెగోషియబుల్‌ ఇన్‌స్ట్రమెంట్‌ (ఎన్‌ఐ) యాక్ట్‌ కేసుల కేసుల సత్వర పరిష్కారానికి ప్రత్యేక కోర్టుల ఏర్పాటే సరైనమార్గమని సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల అత్యున్నతస్థాయి ధర్మాసనం పేర్కొంది.
Published date : 12 Mar 2021 09:36AM

Photo Stories