Skip to main content

చేనేత రంగంపై ఏర్పాటైన కమిటీకి నేతృత్వం వహిస్తున్న వ్యక్తి?

చేనేత ఉత్పత్తి పెంపు, ఎగుమతుల పురోగతిపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది.
ఇందుకు సంబంధించి సిఫారసులు చేయడానికి ఎనిమిది మంది సభ్యుల కమిటీని ఆగస్టు 20న ఏర్పాటు చేసింది. నాలుగేళ్లలో ఎగుమతులు నాలుగు రెట్లు పెరగాలన్నది లక్ష్యం. కమిటీకి ఫ్యాషన్‌ డిజైన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌డీసీఐ) చైర్మన్‌ సునీల్‌ సేథీ నేతృత్వం వహిస్తారు. 30 రోజుల్లో మధ్యంతర నివేదిక, 45 రోజుల్లో తుది నివేదికను సమర్పిస్తారని జౌళి మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.

ప్రస్తుతం జౌళి రంగం ఉత్పత్తి రూ.60,000 కోట్లు. మూడేళ్లలో ఈ సంఖ్య రెట్టింపునకు చేరాలన్నది లక్ష్యమని జౌళి శాఖ మంత్రి పియూష్‌ గోయెల్‌ ఇటీవలే పేర్కొన్నారు. ఇక ఎగుమతులు ఇదే కాలంలో రూ.2,500 కోట్ల నుంచి రూ.10,000 కోట్లకు చేరాలన్నది లక్ష్యం.

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : ఫ్యాషన్‌ డిజైన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌డీసీఐ) చైర్మన్‌ సునీల్‌ సేథీ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు
ఎప్పుడు : ఆగస్టు 20
ఎవరు : భారత ప్రభుత్వం
ఎందుకు : చేనేత ఉత్పత్తి పెంపు, ఎగుమతుల పురోగతికి సంబంధించి సిఫారసులు చేయడానికి...
Published date : 21 Aug 2021 06:01PM

Photo Stories