చైనాలో వరుస భూకంపాలు
Sakshi Education
చైనాలోని సిచువాన్ ప్రావిన్స్ లో రెండు వరుస భూకంపాలు సంభవించాయి.
ఈ భూకంపాల్లో 12 మంది మృతి చెందగా 125 మంది గాయపడ్డారని చైనా ప్రభుత్వం తెలిపింది. జూన్ 17న రిక్టర్ స్కేలుపై 6.0 తీవ్రతతో మొదటి భూకంపం రాగా, రెండవది జూన్ 18న సంభవించింది. చాంగింగ్ కౌంటీలోని యిబిన్ నగరానికి దగ్గర్లో భూమికి 16 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూకంపం కారణంగా పలు భవనాలు కూలిపోయాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : చైనాలో వరుస భూకంపాలు
ఎప్పుడు : జూన్ 17, 18
ఎక్కడ : సిచువాన్ ప్రావిన్స్, చైనా
క్విక్ రివ్యూ :
ఏమిటి : చైనాలో వరుస భూకంపాలు
ఎప్పుడు : జూన్ 17, 18
ఎక్కడ : సిచువాన్ ప్రావిన్స్, చైనా
Published date : 19 Jun 2019 06:04PM