చైనాలో మానవరహిత యుద్ధనౌక ప్రారంభం
Sakshi Education
జరీ అనే మానవరహిత యుద్ధనౌకను చైనా ప్రారంభించింది. ఒక రహస్య ప్రదేశంలో ఈ యుద్ధనౌకను ప్రారంభించినట్లు చైనా అధికారిక మీడియా ‘గ్లోబల్ టైమ్స్’ ఆగస్టు 22న పేర్కొంది.
చైనా ప్రభుత్వ రంగ సంస్థ అయిన చైనా నౌకా నిర్మాణ కార్పొరేషన్ ఈ యుద్ధనౌకను తయారు చేసింది. 15 మీటర్ల పొడవుతో 20 టన్నుల బరువు కలిగిన ఈ నౌక జలాంతర్గాములను విధ్వంసం చేయగలదు. క్షిపణులు, టోర్పిడోలను ప్రయోగిస్తుంది. కృతిమ మేధస్సును ఉపయోగించుకొని స్వతంత్రంగా తన మార్గాన్ని గుర్తించగలదు. రిమోట్ కంట్రోల్ సాయంతో ఈ నౌకను నియంత్రిస్తారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : జరీ అనే మానవరహిత యుద్ధనౌక ప్రారంభం
ఎప్పుడు : ఆగస్టు 22
ఎవరు : చైనా
ఎక్కడ : చైనా
క్విక్ రివ్యూ :
ఏమిటి : జరీ అనే మానవరహిత యుద్ధనౌక ప్రారంభం
ఎప్పుడు : ఆగస్టు 22
ఎవరు : చైనా
ఎక్కడ : చైనా
Published date : 23 Aug 2019 05:45PM