చైనాలో బ్రూసిల్లోసిస్ బ్యాక్టీరియా వ్యాధి
Sakshi Education
చైనాలో కొత్త బ్యాక్టీరియా వ్యాధి వెలుగు చూసింది. జంతువుల ద్వారా బ్రూసిల్లోసిస్ బ్యాక్టీరియా లాంజౌ నగరంలోని 3,245 మందికి సోకినట్లు చైనా తెలిపింది.
మరో 1,401 మందికి బ్యాక్టీరియా ప్రాథమిక దశలో ఉందని సెప్టెంబర్ 18న వెల్లడించింది. ప్రభుత్వ బయో ఫార్మా సూటికల్ ప్లాంట్ నుంచి గాలి ద్వారా బ్యాక్టీరియా సోకినట్లు తెలుస్తోంది. దీని కారణంగా జ్వరం, కీళ్ల నొప్పులు, తలనొప్పి, అవయవాల వాపు, సంతాన సాఫల్యత కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుందని చైనా పేర్కొంది. ప్లాంట్‌లో నిర్వహణ సరిగా లేకనే బ్యాక్టీరియా వ్యాప్తి చెందినట్లు భావిస్తున్నారు.
ప్రపంచంలో 3 కోట్ల కేసులు
ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 కేసుల సంఖ్య 3 కోట్లకి చేరుకుంది. వీటిలో సగం కేసులు అమెరికా, బ్రెజిల్, భారత్ నుంచే వచ్చాయని సెప్టెంబర్ 18న జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ తెలిపింది. 2020, ఆగస్టు 12న రెండు కోట్లు ఉన్న కేసులు నెల రోజుల్లోనే మూడు కోట్లకి చేరుకున్నాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : బ్రూసిల్లోసిస్ బ్యాక్టీరియా వ్యాధి వ్యాప్తి
ఎప్పుడు : సెప్టెంబర్ 18
ఎవరు : చైనా
ఎక్కడ : లాంజౌ నగరం, చైనా

Published date : 19 Sep 2020 06:22PM