చైనా ఓపెన్ విజేతగా కరోలినా మారిన్
Sakshi Education
చైనా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్-1000 టోర్నీలో స్పెయిన్ బ్యాడ్మింటన్ స్టార్ కరోలినా మారిన్ విజేతగా నిలిచింది.
చైనాలోని షాంఘై సెప్టెంబర్ 22న ముగిసిన ఈ టోర్నిలో అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగిన మారిన్ 65 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో 14-21, 21-17, 21-18తో రెండో సీడ్ తై జు యింగ్ (చైనీస్ తైపీ)పై గెలిచింది. మరోవైపు పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్, విశ్వవిజేత కెంటో మొమోటా టైటిల్ దక్కించుకున్నాడు. 90 నిమిషాలపాటు జరిగిన మారథాన్ ఫైనల్లో మొమోటా 19-21, 21-17, 21-19తో ఆంథోనీ జిన్‌టింగ్ (ఇండోనేసియా)పై విజయం సాధించాడు. విజేతగా నిలిచిన మారిన్, మొమోటాలకు 70 వేల డాలర్ల (రూ. 49 లక్షల 75 వేలు) చొప్పున ప్రైజ్‌మనీ లభించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : చైనా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్-1000 టోర్నీ విజేతలు
ఎప్పుడు : సెప్టెంబర్ 22
ఎవరు : కరోలినా మారిన్, కెంటో మొమోటా
ఎక్కడ : షాంఘై, చైనా
క్విక్ రివ్యూ:
ఏమిటి : చైనా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్-1000 టోర్నీ విజేతలు
ఎప్పుడు : సెప్టెంబర్ 22
ఎవరు : కరోలినా మారిన్, కెంటో మొమోటా
ఎక్కడ : షాంఘై, చైనా
Published date : 23 Sep 2019 05:31PM